KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
KTR | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5–6 లక్షలు ఇవ్వడానికి 500 నిబంధనలు పెట్టడం సరికాదన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5–6 లక్షలు ఇవ్వడానికి 500 నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏఎన్ఐతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారు. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ చెబుతున్నారు.. మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడి చేసినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవు అని కేటీఆర్ తెలిపారు.
నల్సార్ యువతకు సెల్యూట్
ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత తిరగబడుతుంది.. ధైర్యంగా నిలబడిన నల్సార్ యువతకు సెల్యూట్. విద్యార్థులకు న్యాయవ్యవస్థ మధ్య సంబంధాన్ని గుర్తించిన సీజేఐకి ధన్యవాదాలు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల గొంతుకకు, వారి హక్కులకు, న్యాయం కోసం వారు చేసే పోరాటానికి తగిన గౌరవం ఉండాలి. అధికారంలో ఉన్న వారు తమ అధికార పరిమితులను దాటి వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అధికార దుర్వినియోగానికి తావులేకుండా అన్ని వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో యువత ప్రశ్నించే హక్కును, తమ ఆత్మగౌరవం కోసం నిలబడే హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించాలి. విద్యార్థులు ప్రశ్నిస్తే వారిని అణచివేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నవారి బాధ్యత అని కేటీఆర్ అన్నారు.
సంబంధిత వార్తలు

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
ఆగస్టు 15, 2026

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
ఆగస్టు 15, 2026

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
- ●Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!
- ●Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ - పెళ్లికి ముందు యాక్సిడెంట్ - ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!
- ●Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
- ●NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్

Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి

Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్‌కు ప్లాన్!

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ - పెళ్లికి ముందు యాక్సిడెంట్ - ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు



