త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | అమెరికా ఎంబ‌సీపై ఇరాన్ దాడి.. రియాద్‌లో ఉద్రిక్త‌త‌

Iran | మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) యుద్ధ మేఘాలు మ‌రింత‌గా క‌మ్ముకుంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చ‌ర్య‌కు ప్ర‌తిగా ఇరాన్ (Iran) దాడులు చేస్తున్న‌ది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున సౌదీఅరెబీయా రాజ‌ధాని రియాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంపై (US Embassy) ఇరాన్ డ్రోన్ల‌తో దాడిచేసింది.

G

International | Published On Mar 3, 2026, 7.58 am IST

Iran | అమెరికా ఎంబ‌సీపై ఇరాన్ దాడి.. రియాద్‌లో ఉద్రిక్త‌త‌
Advertisement

Iran | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) యుద్ధ మేఘాలు మ‌రింత‌గా క‌మ్ముకుంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చ‌ర్య‌కు ప్ర‌తిగా ఇరాన్ (Iran) దాడులు చేస్తున్న‌ది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున సౌదీఅరెబీయా రాజ‌ధాని రియాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంపై (US Embassy) ఇరాన్ డ్రోన్ల‌తో దాడిచేసింది. రెండు డ్రోన్లు ఎంబ‌సీపైకి దూసుకొచ్చాయి. దీంతో భారీ శ‌బ్దం వినిపించ‌డ‌మే కాకుండా ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ ఆకాశాన్ని క‌మ్మేసింది. ఈ దాడిని సౌదీ అరేబియా ర‌క్ష‌ణ శాఖ ధృవీక‌రించింది. దాడుల వ‌ల్ల భ‌వ‌నం స్వల్పంగా ధ్వంస‌మైంద‌ని, మంట‌లు చెల‌రేగ‌డంతో వెంట‌నే ఆర్పివేశామ‌ని తెలిపింది. అదేవిధంగా కువైట్‌లోని యూఎస్ ఎంబ‌సీపై కూడా మిస్సైళ్లు, డ్రోన్ల‌తో ఇరాక్ దాడికి పాల్ప‌డింది.

కాగా, మిడిల్ ఈస్ట్‌లో నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో అమెరిక‌న్ జాతీయుల‌కు యూఎస్ ప్ర‌భుత్వం అడ్వైజ‌రీ జారీచేసింది. మ‌ధ్య‌ప్రాచ్యంలోని 14 దేశాల్లో ఉన్న అమెరిక‌న్లు వెంట‌నే ఆయా దేశాల‌ను వీడాల‌ని ప్ర‌క‌టించింది. బ‌హ్రైన్‌, కువైట్‌, ఈజిప్ట్‌, లెబ‌నాన్‌, ఇరాన్‌, ఒమ‌న్‌, ఇరాక్‌, ఖ‌తార్‌, ఇజ్రాయెల్ ఆక్ర‌మిత‌ వెస్ట్ బ్యాంక్‌, గాజా, సౌదీ అరేబియా, జోర్డాన్‌, సిరియా, యూఏఈ, యెమెన్‌లో ఉన్న అమెరిక‌న్లు వెంట‌నే వెన‌క్కి వ‌చ్చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

 

Advertisement
Advertisement