త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు కంటే.. ‘డీలిమిటేషన్’ అంశమే కీల‌కం : సోనియా గాంధీ

Sonia Gandhi | శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు క‌ల్పించే బిల్లు (Women's Reservation Bill) కంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమైన అంశ‌మ‌ని కాంగ్రెస్ అగ్రనాయ‌కురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ (Sonia Gandhi) అభిప్రాయ‌ప‌డ్డారు.

D

National | Published On Apr 13, 2026, 2.45 pm IST

Sonia Gandhi | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు కంటే.. ‘డీలిమిటేషన్’ అంశమే కీల‌కం : సోనియా గాంధీ
Advertisement

Sonia Gandhi | శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు క‌ల్పించే బిల్లు (Women's Reservation Bill) కంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమైన అంశ‌మ‌ని కాంగ్రెస్ అగ్రనాయ‌కురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ (Sonia Gandhi) అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే కేంద్రం హ‌డావుడిగా ఈ వారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. ఈ మేరకు 'ది హిందూ' పత్రికలో ప్ర‌త్యేక వ్యాసం రాశారు. లోక్‌సభ స్థానాల పెంపు కోసం ప్ర‌భుత్వం చేపడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో 'నారీ శక్తి వందనం అధినియమ్‌' సవరణ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లును తీసుకురావడంపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు స‌వ‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు కోరుతూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్ని పార్టీల‌కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచే అమ‌లు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌తంలో కోర‌గా.. అందుకు ప్ర‌ధాని నిరాక‌రించార‌ని ఈ సంద‌ర్భంగా సోనియా గుర్తు చేశారు. అప్పుడు కాద‌ని, ఇప్పుడు 2029 నుంచి అమలు చేస్తామని చెప్పడం రాజకీయ ల‌బ్ధి కోస‌మే అని విమర్శించారు. ఇందుకోసం హ‌డావుడిగా ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏముంది..? అని ప్ర‌శ్నించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై చర్చించేందుకు బెంగాల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్ర‌తిపాద‌న గురించి ప్ర‌తిప‌క్షం ఇప్ప‌టికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు గుర్తు చేశారు. అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధానమంత్రి తిరస్కరించారని మండిప‌డ్డారు. అందుకు బదులుగా పార్టీలకు లేఖలు రాయడం, వ్యాసాలు రాయ‌డం వంటివి చేస్తున్నారని దుయ్యబట్టారు.

నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌న మాటే నెగ్గాలి అన్న‌ట్టు ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఎన్నిక‌ల వేళ ఈ అంశాలను పార్లమెంట్‌లో చర్చకు తెస్తున్నారంటూ సోనియా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీల శాసనసభల్లో మహిళ‌ల‌కు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆలోచనను ప్రతిపక్షం ఏమాత్రం వ్యతిరేకించలేదని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. 2027 జనాభా లెక్కలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. సరైన, స్పష్టమైన సమాచారం లేకుండా డీలిమిటేషన్ చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 'నారీ శక్తి వందనం అధినియమ్‌' సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కాకుండా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో తీసుకురావాలని ఈ సంద‌ర్భంగా కేంద్రాన్ని సోనియా కోరారు.

Also Read..

చిచ్చ‌ర పిడుగు బ్యాట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్ వేత‌నం ఎంతంటే..?

మ‌హిళ‌ల‌తోనే ప్ర‌జాస్వామ్యం మ‌రింత బ‌లోపేతం : ప్ర‌ధాని మోదీ

భారీ బ్యాట‌రీ, అదిరిపోయే డిజైన్‌తో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్

Advertisement
Advertisement