త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Sooryavanshi | చిచ్చ‌ర పిడుగు బ్యాట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్ వేత‌నం ఎంతంటే..?

Vaibhav Sooryavanshi | భార‌త యువ సంచ‌ల‌నం, చిచ్చ‌ర పిడుగు బ్యాటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పేరు ప్ర‌స్తుతం మారుమోగిపోతోంది. ఇటీవ‌ల ముంబై ఇండియ‌న్స్‌తోపాటు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఐపీఎల్ 2026 సీజ‌న్ మ్యాచ్‌ల‌లో చెల‌రేగి ఆడాడు. అంత‌ర్జాతీయ స్థాయి బౌల‌ర్ల‌కు సైతం చుక్క‌లు చూపించాడు.

S

Cricket | Published On Apr 13, 2026, 1.57 pm IST

Vaibhav Sooryavanshi | చిచ్చ‌ర పిడుగు బ్యాట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్ వేత‌నం ఎంతంటే..?
Advertisement

Vaibhav Sooryavanshi | భార‌త యువ సంచ‌ల‌నం, చిచ్చ‌ర పిడుగు బ్యాటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పేరు ప్ర‌స్తుతం మారుమోగిపోతోంది. ఇటీవ‌ల ముంబై ఇండియ‌న్స్‌తోపాటు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఐపీఎల్ 2026 సీజ‌న్ మ్యాచ్‌ల‌లో చెల‌రేగి ఆడాడు. అంత‌ర్జాతీయ స్థాయి బౌల‌ర్ల‌కు సైతం చుక్క‌లు చూపించాడు. దీంతో అత‌ని ప్ర‌తిభ ప‌ట్ల అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 15 ఏళ్ల వ‌య‌స్సులోనే అంత‌టి టాలెంట్ ఎలా వ‌చ్చింద‌ని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అభిమానుల‌కు ఇప్పుడు ఒక పెద్ద ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్నాడు క‌దా, అత‌ని వేత‌నం ఎంత‌..? అని ఫ్యాన్స్ ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంత గొప్ప‌గా ఆడుతున్నా అత‌ని ప్ర‌స్తుత ఐపీఎల్ వేత‌నం ఒక సాధార‌ణ ఐపీఎల్ ప్లేయ‌ర్ వేత‌నం క‌న్నా త‌క్కువే కావ‌డం గ‌మ‌నార్హం.

అత‌ని విలువ రూ.3.77 కోట్లు అయినా..

వైభవ్ సూర్యవంశీని 2025 ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతను అద్భుతంగా రాణించి, 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి 206.55 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. గత సీజన్‌లో ఒక అర్ధశతకం, ఒక శతకం కూడా సాధించాడు. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ 2026కు కూడా అంతే మొత్తంతో రిటైన్ చేసుకున్నారు. ఐపీఎల్ 2026లో మొదటి మూడు మ్యాచ్‌లతోనే వైభవ్ సుమారు రూ.3.53 కోట్ల లాభం సాధించాడు. అతని మొత్తం మ్యాచ్ విలువ రూ.3.77 కోట్లు కాగా, ఈ మ్యాచ్‌లకు అతని ఒప్పంద వ్యయం కేవలం రూ.23.57 లక్షలు మాత్రమే. అంటే, రాజస్థాన్ రాయల్స్ అతన్ని అతని అసలు విలువ కంటే చాలా తక్కువ ధరకు దక్కించుకుంద‌న్న‌మాట‌.

వేత‌నాన్ని మించి ప్ర‌ద‌ర్శ‌న‌..

సీఎస్‌కే మ్యాచ్‌లో రూ.1.32 కోట్లు, జీటీ మ్యాచ్‌లో రూ.0.75 కోట్లు, ఎంఐ మ్యాచ్‌లో రూ.1.47 కోట్ల‌ విలువైన ప్రదర్శన ఇచ్చినట్లు హిందుస్థాన్ టైమ్స్ త‌న‌ నివేదికలో పేర్కొంది. మొదటి మూడు మ్యాచ్‌లతోనే అతను దాదాపు 15.98 రెట్లు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అందించాడు. అంటే అతను తన జీతాన్ని మించి ప్రదర్శన ఇస్తున్నాడ‌న్న‌మాట‌. ఇది ఐపీఎల్ 2026లో కేవలం మూడు మ్యాచ్‌లే జరిగిన దశలోనే కావ‌డం విశేషం.

ఐపీఎల్‌లో ఆడిన అతి చిన్న వ‌య‌స్సు ప్లేయ‌ర్‌గా..

వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తజ్‌పూర్‌లో జన్మించాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు అతను ఐపీఎల్ చరిత్రలో కాంట్రాక్ట్ పొందిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. అప్పటికే అతను భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో 58 బంతుల్లో శతకం కూడా సాధించాడు. ఐపీఎల్ 2025లో అతను చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే పురుషుల టీ20ల్లో శతకం చేసిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌పై 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు.

త‌ల్లిదండ్రుల స‌పోర్ట్‌తో..

ఆ సీజన్‌ను అతను 7 మ్యాచ్‌లలో 252 పరుగులతో, 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. అలాగే 2026 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు టైటిల్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌లలో 439 పరుగులు చేసి భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా క్రికెటర్ కావాలనుకున్నాడు. తన కుమారుడి శిక్షణ కోసం వ్యవసాయ భూమిని విక్ర‌యించాడు. అతని తల్లి ఆర్తి సూర్యవంశీ కూడా త‌న కుమారుడికి స‌పోర్ట్ చేసింది. ప్రతి రోజు తెల్లవారుజామున లేచి అతనికి కోచింగ్‌కు ముందు ఆహారం సిద్ధం చేసేది. అయితే భ‌విష్య‌త్తులో వైభ‌వ్‌కు ఐపీఎల్‌లో భారీ ఎత్తున ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement