త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్ర‌పూరిత చ‌ర్య‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కేటీఆర్‌

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్ర‌పూరిత చ‌ర్య‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు కేటీఆర్ సూచించారు. ఓట‌ర్ల జాబితాలో దొంగ ఓట్లు, డ‌బుల్ ఓట్లు న‌మోదు కాకుండా నిఘా పెట్టాల‌న్నారు.

D

Hyderabad | Published On May 16, 2026, 2.34 pm IST

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్ర‌పూరిత చ‌ర్య‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కేటీఆర్‌
Advertisement

KTR | తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటర్ల జాబితా సవరణ), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర‌పూరితంగా మ‌న ఓట్ల‌ను తొల‌గించ‌కుండా క్షేత్ర‌స్థాయిలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. ఓట‌ర్ల జాబితాలో దొంగ ఓట్లు, డ‌బుల్ ఓట్లు న‌మోదు కాకుండా నిఘా పెట్టాల‌న్నారు. అర్హులైన ప్ర‌జ‌ల ఓటు హ‌క్కును కాపాడ‌టంలో ప్ర‌తి బూత్ స్థాయిలో 'బూత్ లెవెల్ అసిస్టెంట్లు' (BLAs) కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్పొరేటర్ ఆశావాహులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాల‌ని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, కంటోన్మెంట్ బోర్డ్ సభ్యులు , సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Also Read..

కేసీఆర్‌ను తిడితే కేటీఆర్‌కు కోపం రాదా..? : త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ : మంత్రి సీతక్క

బండి భగీరథ్పై లుకౌట్ నోటీసులు

ట్యాగ్స్:

Advertisement
Advertisement