BRSV | ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే దుష్ప్రచారం: బీఆర్ఎస్వీ
BRSV | తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే హరీశ్‌రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హరీశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌రెడ్డిలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
BRSV | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే హరీశ్‌రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. హరీశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌రెడ్డిలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారిని బయట తిరుగనీయబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్వీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్న హరీశ్ రావుపై ఉద్దేశపూర్వకంగానే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. అందుకే హరీశ్ వారికి లీగల్ నోటీసులు పంపారన్నారు.
పుట్టినరోజు వచ్చినా, మొక్కులు తీర్చుకోవాలన్నా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. అలా భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి.. దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. ఆధారాలు లేకుండా చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే వార్తా ఛానెళ్లు, ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో.. అదే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. అంతేకాకుండా సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ తప్పుడు వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలన్నారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేక పోయినా.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, చటారి దశరథ్, కాటం శివ, బొల్లు నాగరాజు యాదవ్, కొంపల్లి నరేష్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్, నాగేందర్ రావు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!



