Sony BRAVIA 9II | సోనీ నుంచి 115 ఇంచుల భారీ టీవీ.. ధర ఎంతంటే..?
Sony BRAVIA 9II | సోనీ ఇండియా తన బ్రావియా టెలివిజన్ శ్రేణిలో అత్యంత భారీ స్క్రీన్‌తో కూడిన కొత్త బ్రావియా 9II 115 ఇంచుల మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌తో సోనీ ట్రూ ఆర్‌జీబీ బ్రావియా పోర్ట్‌ఫోలియో ఇప్పుడు 55 ఇంచుల 115 ఇంచుల వరకు విస్తరించింది.
Sony BRAVIA 9II | సోనీ ఇండియా తన బ్రావియా టెలివిజన్ శ్రేణిలో అత్యంత భారీ స్క్రీన్‌తో కూడిన కొత్త బ్రావియా 9II 115 ఇంచుల మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌తో సోనీ ట్రూ ఆర్‌జీబీ బ్రావియా పోర్ట్‌ఫోలియో ఇప్పుడు 55 ఇంచుల 115 ఇంచుల వరకు విస్తరించింది. ప్రస్తుతం ట్రూ ఆర్‌జీబీ బ్రావియా సిరీస్‌లో బ్రావియా 7II మోడళ్లు 55, 65, 75, 85 ఇంచుల స్క్రీన్ పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. బ్రావియా 9II సిరీస్‌లో ఇప్పటికే 75, 85 ఇంచుల మోడళ్లు ఉండగా తాజాగా 115 ఇంచుల మోడల్ వచ్చి చేరింది. 2024 నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి బ్రావియా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారని సోనీ తెలిపింది.
ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రొ టెక్నాలజీ..
కొత్త బ్రావియా ట్రూ ఆర్‌జీబీ టెలివిజన్లు సోనీ అభివృద్ధి చేసిన ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రొ టెక్నాలజీతో వచ్చాయి. ఈ సాంకేతికత ప్రతి ఆర్‌జీబీ ఎల్‌ఈడీని స్వతంత్రంగా నియంత్రించడం ద్వారా మరింత విస్తృతమైన కలర్ వాల్యూమ్, విశాలమైన కలర్ గామట్, మెరుగైన కాంట్రాస్ట్, ఎక్కువ డెప్త్, స్మూత్ కలర్ గ్రాడేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ టీవీల్లో ఎక్స్-వైడ్ యాంగిల్ ప్రొ ఫీచర్ ఉండటంతో ఏ కోణంలో చూసినా రంగులు సహజంగా కనిపిస్తాయి. అలాగే ల్యూమినెన్స్ బూస్టర్ ప్రొ అధిక ప్రకాశాన్ని అందిస్తూ కూడా రంగుల నాణ్యతను కాపాడుతుంది. స్మూత్ కలర్ గ్రాడేషన్ ఫీచర్ కలర్ బ్యాండింగ్‌ను తగ్గించి సహజమైన టోన్ మార్పులను చూపిస్తుంది. ఇమర్సివ్ బ్లాక్ స్క్రీన్ ప్రొ ఫీచర్ బ్రావియా 9II సిరీస్‌లోని మోడళ్లలో అందుబాటులో ఉంది. అయితే 115 ఇంచుల మోడల్‌కు ఇది లేదు. ఈ టెక్నాలజీ గ్లేర్-ఫ్రీ, లో-రిఫ్లెక్షన్ స్క్రీన్ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగించి నల్లని సన్నివేశాల్లో మరింత స్పష్టమైన డిటెయిల్స్‌ను చూపిస్తుంది.
మల్టీ ఆడియో ప్లస్ సిస్టమ్..
115 ఇంచుల బ్రావియా 9IIలో అకౌస్టిక్ మల్టీ-ఆడియో ప్లస్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో మొత్తం 12 స్పీకర్లు ఉంటాయి. వీటిలో రెండు సబ్‌వూఫర్లు, ఎనిమిది ఫుల్-రేంజ్ స్పీకర్లు, రెండు ట్వీటర్లు ఉన్నాయి. మొత్తం 85 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌తో పాటు డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, డీటీఎస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ ట్రూ ఆర్‌జీబీ బ్రావియా టెలివిజన్లు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. వ్యక్తిగతీకరించిన ఇంటర్‌ఫేస్ ద్వారా సినిమాలు, టీవీ షోలు, యాప్‌లు, గేమ్‌లకు సులభంగా యాక్సెస్ లభిస్తుంది. భవిష్యత్తులో ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్ ద్వారా సపోర్ట్ చేసే టీవీలకు జెమిని ఫర్ గూగుల్ టీవీ కూడా అందుబాటులోకి వస్తుందని సోనీ వెల్లడించింది.
ధర వివరాలు..
బ్రావియా 9II 75 ఇంచుల మోడల్ ధర రూ.8,39,900 ఉండగా, బెస్ట్ బై ధరను రూ.5,39,990గా నిర్ణయించారు. 85 ఇంచుల మోడల్ ధర రూ.9,89,900 కాగా, బెస్ట్ బై ధర రూ.6,69,990 గా ఉంది. కొత్త 115 ఇంచుల బ్రావియా 9II మోడల్ ధర రూ.45,99,900 కాగా, బెస్ట్ బై ధర రూ.28,99,990గా ఉంది. బ్రావియా 7II 55 ఇంచుల మోడల్ ధరను రూ.3,59,900గా నిర్ణయించారు. బెస్ట్ బై ధర రూ.2,21,990గా ఉంది. 75, 85, 55 ఇంచుల మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉండగా, 115 ఇంచుల మోడల్ ను త్వరలో విక్రయించనున్నారు. ఈ ట్రూ ఆర్‌జీబీ బ్రావియా టెలివిజన్లు సోనీ సెంటర్‌లు, సోనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, షాప్ ఎట్ ఎస్‌సీ, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్లు, ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Acerpure Nitro QLED TV | ఏసర్ నుంచి భారీ క్యూఎల్ఈడీ టీవీలు.. బడ్జెట్ ధరలకే లభ్యం..
సెప్టెంబర్ 30, 2026

Hisense UR8S | హైసెన్స్ నుంచి ఆర్‌జీబీ మినీ ఎల్ఈడీ టీవీలు.. తక్కువ ధరలకే లాంచ్..
ఆగస్టు 11, 2026

Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం

One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!



