RTC Employees | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి
RTC Employees | పదవీ విరమణ చేసి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్స్ రాకుండానే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారని వాపోయారు. తక్షణమే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు బస్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
ఆందోళనకు దిగిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
RTC Employees | త్రినేత్ర.న్యూస్ : పదవీ విరమణ చేసి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్స్ రాకుండానే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారని వాపోయారు. తక్షణమే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు బస్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బస్ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీ ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు అయ్యా రేవంతు రెడ్డి.. విరిగిపోతున్నది మా నడ్డి.. అంటూ నినదించారు. పదవీ విరమణ అనంతరం మెడికల్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్‌సీలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనితో పాటు పదవీ విరమణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య చికిత్సలు నిర్వహించాలని కోరారు. సూపర్ లగ్జరీ బస్‌లలోనూ రిటైర్డ్ ఉద్యోగులకు అనుమతించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బకాయిలు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్





