త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sikkim CM | ఇంధ‌న పొదుపు.. 2 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లిన సిక్కిం సీఎం

Sikkim CM | ఇంధ‌నాన్ని పొదుపు (Fuel Conservation) చ‌ర్య‌ల్లో భాగంగా సిక్కిం ముఖ్య‌మంత్రి ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ (Prem Singh Tamang) అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఏకంగా రెండు కిలోమీట‌ర్ల మేర న‌డుచుకుంటూనే వెళ్లారు.

D

National | Published On May 18, 2026, 5.35 pm IST

Sikkim CM | ఇంధ‌న పొదుపు.. 2 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లిన సిక్కిం సీఎం
Advertisement

Sikkim CM | ఇంధ‌నాన్ని పొదుపు (Fuel Conservation) చేయాలంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (Pm Modi) ఇచ్చిన పిలుపుకు విశేష స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ కాన్వాయ్‌లోని వాహ‌నాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకున్న విష‌యం తెలిసిందే. పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా కొంద‌రు సైకిల్‌పై వెళ్తుండ‌గా.. మ‌రికొంద‌రు మెట్రోలో ప్ర‌యాణిస్తున్నారు. అయితే సిక్కిం ముఖ్య‌మంత్రి (Sikkim CM) ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ (Prem Singh Tamang) ఓ అడుగు ముందుకేశారు. అధికారిక కార్య‌క్ర‌మం కోసం ఆయ‌న ఏకంగా రెండు కిలోమీట‌ర్ల మేర కాలి న‌డ‌క‌నే వెళ్లారు.

ఓ అధికారిక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు త‌మాంగ్‌.. త‌న నివాస‌మైన 'మింటోక్‌గాంగ్' నుంచి డెవలప్‌మెంట్ ఏరియా సమీపంలోని 'మనన్ కేంద్ర' వరకు దాదాపు రెండు కిలోమీట‌ర్ల‌మేర న‌డుచుకుంటూనే వెళ్లారు. కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో ప్రైవేట్ వాహనాలకు స‌రిబేసి నిబంధ‌న నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు మాత్రం ఈ నిబంధ‌న కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక కార్య‌క్ర‌మం ముగిస‌న త‌ర్వాత కూడా ఆయ‌న త‌న కాన్వాయ్‌లో కాకుండా.. ట్యాక్సీలో ఇంటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పొదుపు చ‌ర్య‌ల‌ను పాటించాల‌ని సీఎం సూచించారు. కాగా, గ‌త కొన్ని రోజులుగా సీఎం త‌న నివాసంలోని స‌మీప ప్రాంతాల‌కు న‌డుచుకుంటూనే వెళ్తుండ‌టం విశేషం.

Also Read..

వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. వాటి మ‌ధ్య‌న న‌లిగి మ‌హిళా టూరిస్ట్ మృతి

నీట్ పేప‌ర్ లీక్‌లో మ‌రో అరెస్ట్‌.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌కు చేరిన ప్ర‌శ్న‌ప‌త్రం

యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisement
Advertisement