త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో

Karnataka Vidhana Soudha | క‌ర్ణాట‌క విధాన సౌధ‌లో (Karnataka Vidhana Soudha) బాంబు పేలుడు (bomb blast) జ‌రిగిన‌ట్లుగా పూర్తిగా ఏఐ సాంకేతిక‌తో రూపొందించిన న‌కిలీ వీడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేర‌డంతో కేసు న‌మోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

D

National | Published On Oct 22, 2026, 10.40 am IST

Karnataka Vidhana Soudha | కర్ణాటక విధాన సౌధలో బాంబు పేలుడు అంటూ వీడియో
Advertisement

Karnataka Vidhana Soudha | త్రినేత్ర న్యూస్ : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగం ఓ పెద్ద సవాలుగా మారింది. AI సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో.. దాన్ని తప్పుగా ఉపయోగించే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. చాలా మంది నెటిజ‌న్లు డీప్‌ఫేక్స్ (Deepfakes), న‌కిలీ వీడియోల‌తో ఏఐని దుర్వినియోగ ప‌రుస్తున్నారు. తాజాగా క‌ర్ణాట‌క విధాన సౌధ‌లో (Karnataka Vidhana Soudha) బాంబు పేలుడు (bomb blast) జ‌రిగిన‌ట్లుగా పూర్తిగా ఏఐ సాంకేతిక‌తో రూపొందించిన న‌కిలీ వీడియో క‌ల‌క‌లం రేపుతోంది.

బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు (Bihar man) విధాన సౌధ‌ను బాంబుతో పేల్చేసిన‌ట్లు ఏఐ సాయంతో ఫేక్‌ వీడియో రూపొందించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు విధాన సభను బాంబుతో పేల్చేశారు అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇంకేముంది ఈ వీడియో కాస్తా క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మార‌డంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిజంగానే పేలుడు జరిగిందేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేర‌డంతో కేసు న‌మోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 25 ఏళ్ల హజ్రత్ అలీగా గుర్తించారు. ఇతడు కొన్ని నెలల క్రితమే ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వచ్చి రోజువారీ కూలీగా ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు ఫేక్ వీడియోల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు. ఇలాంటి ఫేక్ వీడియోల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తే చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు.

Also Read..

ముడిచమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. బహుజన పోరాట యోధుడు పండుగ సాయ‌న్న‌: హ‌రీశ్ రావు

ట‌ర్కీలో ప్ర‌మాదం.. నిర్మ‌ల్ జిల్లా యువకుడు మృతి

Advertisement
Advertisement