త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Ali Khan | కేదార్‌నాథ్ ఆల‌యంలో పూజ‌లు – చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్‌

ఇటీవ‌లే కేదార్‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించింది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌. ఆల‌య గ‌ర్భ‌గుడిలో ఆమె పూజ‌లు, అభిషేకం నిర్వ‌హించింది. ముస్లిం అయిన సారా అలీఖాన్ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమెపై ఆలిండియా ముస్లిం జ‌మాత్ అధ్య‌క్షుడు ఫ‌త్వా జారీ చేసింది. కేదార్‌నాథ్‌ను సంద‌ర్శించినందుకు ముస్లిమ్‌ల‌కు సారా అలీఖాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్నారు.

N

Entertainment | Published On Oct 30, 2026, 3.59 pm IST

Sara Ali Khan | కేదార్‌నాథ్ ఆల‌యంలో పూజ‌లు – చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్‌
Advertisement

Sara Ali Khan | బాలీవుడ్ (Bollywood)హీరోయిన్ సారా అలీఖాన్ చిక్కుల్లో ప‌డింది. కేదార్‌నాథ్ ఆల‌యంలో పూజ‌లు చేసిన ఆమెపై ఫ‌త్వా జారీ అయ్యింది. అక్టోబ‌ర్ 25వ తేదీన కేదార్‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించింది సారా అలీఖాన్‌. ఎలాంటి వీఐపీ ప్రోటోకాల్స్ లేకుండా సాధార‌ణ భ‌క్తుల‌తో క‌లిసి అర‌గంట‌కుపైనే క్యూ లైన్‌లో నిల‌బ‌డింది. గ‌ర్భ‌గుడిలోని శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌ల‌తో పాటు అభిషేకం చేసింది. హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ది. అంతే కాకుండా కేదార్‌నాథ్ స‌మీపంలో ఉన్న భూకుంట్ భైర‌వ్ ఆలయంలో పూజ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ఫ‌త్వా జారీ...

ముస్లిం అయిన సారా అలీఖాన్ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డ‌మే కాకుండా పూజ‌ల్లో పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ పూజ‌ల కార‌ణంగా బాలీవుడ్ హీరోయిన్ చిక్కుల్లో ప‌డింది. ఆమెపై ఆలిండియా ముస్లిం జ‌మాత్ ఫ‌త్వా జారీ చేసింది. ముస్లిమ్‌లు ఇత‌ర మ‌త ఆచారాల్లో విగ్ర‌హారాధ‌న‌లో పాల్గొన‌డం నిషేధ‌మ‌ని, ముస్లిమ్‌ల‌కు ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆలిండియా ముస్లిం జ‌మాత్ జాతీయ అధ్య‌క్షుడు మౌలానా ముఫ్తీ ష‌హాబుద్దీన్ ర‌జ్వీ డిమాండ్ చేశారు. ఇంకోసారి ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌కూడ‌ద‌ని అన్నారు.

త‌ప్పేం కాదు...

ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేష‌న్ మాత్రం సారా అలీఖాన్‌కు స‌పోర్ట్‌గా నిలిచారు. ఆల‌య సంద‌ర్శ‌న త‌ప్పేం కాద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రికి త‌మ‌కు న‌చ్చిన ప్రార్ధ‌న స్థ‌లాల‌ను సంద‌ర్శించే హ‌క్కు ఉంద‌ని అన్నారు.

సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌...

అయితే సారా అలీఖాన్ కేదార్‌నాథ్ సంద‌ర్శ‌న త‌ర్వాత అల‌య క‌మిటీ నిబంధ‌న‌ల వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్య‌మ‌త‌స్తులు ఆల‌యంలో పూజ‌లు చేయాలంటే స‌నాత‌నం ధ‌ర్మం, హిందూ ఆచారాలు, సంప్ర‌దాయాల‌పై త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని తెలుపుతూ రాత‌పూర్వ‌కంగా సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ స‌మ‌ర్పించాల‌ని రూల్స్‌ ఉన్నాయి. ఆల‌య క‌మిటీ నిబంధ‌న‌లు సారా అలీఖాన్ పాటించింద‌ని, డిక్ల‌రేష‌న్ పూర్తిచేసిన త‌ర్వాతే ఆమె కేదార్‌నాథ్‌లో పూజ‌లు చేసిన‌ట్లు చెబుతోన్నారు.

ఉడ్తా తీర్‌...

సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టించిన ఉడ్తా తీర్ మూవీ ఇటీవ‌లే రిలీజైంది. ఆయుష్మాన్ ఖురానా క‌థానాయ‌కుడిగా క‌నిపించిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 

ట్యాగ్స్:

All India Imam AssociationAll India Muslim JamaatBollywood ControversyBollywood NewsCelebrity NewsFatwaKedarnath TempleMufti Shahabuddin RazviSara Ali KhanTemple Visit
Advertisement
Advertisement