త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మూసీ ప్ర‌క్షాళ‌న ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం

Ramchandar Rao | తాము మూసీ పునరుజ్జీవన (Musi River Rejuvenation) ప్రాజెక్టును వ్య‌తిరేకించ‌డం లేద‌ని.. పేద ప్ర‌జ‌ల‌ను నిర్వాసితుల‌ను చేస్తే మాత్రం ఒప్పుకోమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు (Ramchandar Rao) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 30, 2026, 3.28 pm IST

Ramchandar Rao | మూసీ ప్ర‌క్షాళ‌న ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం
Advertisement
  • వాళ్ల ఇండ్ల‌కు న‌ష్టం లేకుండా ప్ర‌ణాళిక‌లు ఉండాలి
  • మాక్ పార్ల‌మెంట్ పేరుతో ‘ఇండీ’ కూట‌మి నాట‌కాలు ఆడుతోంది
  • నాంప‌ల్లి పార్టీ కార్యాల‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఫైర్

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: తాము మూసీ పునరుజ్జీవన (Musi River Rejuvenation) ప్రాజెక్టును వ్య‌తిరేకించ‌డం లేద‌ని.. పేద ప్ర‌జ‌ల‌ను నిర్వాసితుల‌ను చేస్తే మాత్రం ఒప్పుకోమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు (Ramchandar Rao) వ్యాఖ్యానించారు. ‘గాంధీ సరోవర్’ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ఇళ్ల‌కు నష్టం క‌లిగిస్తే క‌చ్చితంగా వ్య‌తిరేకిస్తామ‌న్నారు. వారి ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మూసీని ప్రక్షాళన చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు త‌యారు చేయాల‌ని సూచించారు. ఈమేరకు శుక్ర‌వారం హైద‌రాబాద్ నాంప‌ల్లి పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. మాక్ పార్ల‌మెంట్ పేరుతో ‘ఇండీ’ కూట‌మి నాట‌కాలు ఆడుతోంద‌ని మండిప‌డ్డారు.

మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటోందంటూ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు, పీఆర్‌సీ (PRC) అమలు చేయడానికి నిధులు లేవని చెబుతున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడటం విడ్డూరంగా ఉంది. పథకాలకు లేని డబ్బులు ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

మాక్ పార్లమెంట్‌తో నాట‌కాలు..

ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన ‘మాక్ పార్లమెంట్’ (Mock Parliament)తో కాంగ్రెస్ నేతలు నాట‌కాలు ఆడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. 2010లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తే.. అసలు దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీసిన వ్యక్తి సోనియా గాంధీ కాదా? పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయమని, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. కానీ నేడు అదే కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాక్ పార్లమెంట్లు పెట్టి పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని చులకన చేస్తున్నారు.

2010లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చర్యగా కనిపిస్తే 2026 నాటికి కాంగ్రెస్‌కు ఎలా ఆమోదయోగ్యంగా మారింది? ఈ పచ్చి ద్వంద్వ వైఖరిపై సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలను అవహేళన చేయడమే ఇండీ కూటమి అసలు నైజం అని రాంచంద‌ర్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

ట్యాగ్స్:

HyderabadINDIA AllianceMock Parliament TelanganaMusi River RejuvenationPoor People HousesRamchandar Rao
Advertisement
Advertisement