Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..
Gig Workers | అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు పర్యవేక్షణ కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సమగ్ర సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటును అధికారికంగా ప్రకటించింది.
Gig Workers | అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు పర్యవేక్షణ కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సమగ్ర సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటును అధికారికంగా ప్రకటించింది. సామాజిక భద్రతా కోడ్ కింద చట్టబద్ధంగా ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పనిచేస్తున్న కార్మికులను కూడా దేశంలోని అధికారిక సంక్షేమ వ్యవస్థలోకి తీసుకురావడంలో ఇది కీలక పరిణామంగా పేర్కొంది.
గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు అంటే..
సంప్రదాయ ఉద్యోగి, యజమాని సంబంధం లేకుండా వివిధ పనులు చేస్తూ ఆదాయం పొందేవారిని గిగ్ వర్కర్లుగా పరిగణిస్తారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లేదా వాటి సహకారంతో పనిచేసేవారిని ప్లాట్‌ఫామ్ వర్కర్లుగా గుర్తిస్తారు. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతోపాటు ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు, యజమానులు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
బోర్డు విధి విధానాలు ఏమిటి..?
లక్షలాది మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించడం, వాటి అమలును పర్యవేక్షించడం, అవసరమైన సిఫార్సులు చేయడం ఈ బోర్డు ప్రధాన బాధ్యత. అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల వివిధ విభాగాలకు అనుగుణంగా తగిన సంక్షేమ పథకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. సామాజిక భద్రతా కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూచించే అంశాలపై సలహాలు ఇవ్వడంతోపాటు కేంద్రం నిర్వహించే సంక్షేమ పథకాల పనితీరును పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డు ఏడాదికి కనీసం మూడు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కార్మికుల వివరాల నమోదు, రికార్డుల నిర్వహణ విధులను సమీక్షించడంతోపాటు సంక్షేమ నిధులు, ఖాతాల నుంచి జరుగుతున్న ఖర్చులను కూడా పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అప్పగించే ఇతర బాధ్యతలను సైతం నిర్వర్తిస్తుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప
- ●Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు
- ●Ramchandar Rao | మూసీ ప్రక్షాళన ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం
- ●Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...
- ●Woman Suicide | కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
- ●Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ

IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప

Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు

Ramchandar Rao | మూసీ ప్రక్షాళన ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం

Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...






