త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సైబర్ నేరగాళ్లను క‌ఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టుల‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Supreme Court | సైబ‌ర్‌ మోసాల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డిజిటల్ అరెస్టులతో కూడిన సైబర్ నేరాలను (cybercrimes) డిజిటల్ దోపిడీ (digital dacoity)గా అభివ‌ర్ణించింది.

D

National | Published On Oct 28, 2026, 3.29 pm IST

Supreme Court | సైబర్ నేరగాళ్లను క‌ఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టుల‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు (cybercrimes) విప‌రీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. డిజిటల్ అరెస్టు (digital arrests) వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్ర‌జ‌లు ప‌దేప‌దే మోస‌పోతూనే ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌తోపాటూ రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా నేర‌గాళ్ల (cyber frauds) ఉచ్చులో చిక్కుకుని మోస‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ అరెస్ట్‌ల పేరిట జ‌రుగుతున్న సైబ‌ర్‌ మోసాల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డిజిటల్ అరెస్టులతో కూడిన సైబర్ నేరాలను (cybercrimes) డిజిటల్ దోపిడీగా అభివ‌ర్ణించింది.

తమ కంపెనీ బ్యాంకు ఖాతాను మ్యూల్ అకౌంట్ (Mule Account)గా ఉపయోగించేందుకు అనుమతించారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులపై నమోదైన 35 క్రిమినల్ కేసులను ఒకచోట చేర్చేందుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిరాకరించింది. ఈ మేర‌కు నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. కేసుల విచారణను అడ్డుకునేందుకు నిందితులు ఈ న్యాయ ప్రక్రియను ఉపయోగించుకోవడానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌బోమ‌ని తేల్చి చెప్పింది. బాధితులు పోగొట్టుకున్న డబ్బు హాంగ్‌కాంగ్, బ్యాంకాక్‌లకు తరలిపోతే న్యాయం కోసం బాధితుల‌ను అక్కడికి వెళ్లాలని ఆదేశించగలమా..? అని సీజేఐ ప్రశ్నించారు. నిందితుల సౌల‌భ్యం కోసం బాధితుల‌ను ఇబ్బంది పెట్ట‌లేమని ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ద‌ర్యాప్తు సౌలభ్యం కోసం కేసుల బ‌దిలీని పోలీసులే స్వయంగా కోరితేనే అటువంటి అభ్యర్థనను పరిశీలిస్తామని వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ అరెస్టుల‌పై సీజేఐ ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాలు డిజిటల్ దోపిడీ కిందకే వస్తాయి. ఇటువంటి వ్యక్తులకు ఎలాంటి న్యాయపరమైన రక్షణ కల్పించే ప్రసక్తే లేదు” అని ధర్మాసనం తేల్చిచెప్పింది. వీడియో కాల్స్ ద్వారా అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్న వ్యవస్థీకృత సైబర్ నేరగాళ్లను అత్యంత నిర్దాక్షిణ్యంగా (Ruthlessly) శిక్షించాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. ఈ 35 కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు వ్యాఖ్య‌ల‌తో నిందితులు త‌మ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Also Read..

రాజ్య‌స‌భ బ‌రిలోకి హ‌ర్దీప్ సింగ్ పురి

ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీర‌జ్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య‌

భార‌త్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత తొలిసారి అధికారిక పిలుపు

Advertisement
Advertisement