IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప
IPL 2027 | ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కోచింగ్ సిబ్బందిలో భారీ మార్పులు చేసింది. టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉతప్పను బ్యాటింగ్ కోచ్‌గా, న్యూజిలాండ్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనగన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
IPL 2027 | ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కోచింగ్ సిబ్బందిలో భారీ మార్పులు చేసింది. టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉతప్పను బ్యాటింగ్ కోచ్‌గా, న్యూజిలాండ్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనగన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌కు ఫీల్డింగ్ బాధ్యతలు అప్పగించగా.. ధావల్ కులకర్ణిని డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ కొనసాగనున్నాడు.
ముంబయితోనే మొదలు..
ఉతప్పకు ముంబయి ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. 2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో ముంబయి తరఫున 14 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. ఆ తర్వాత పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచ్‌ల్లో 4,952 పరుగులు సాధించాడు. 2014లో కేకేఆర్ తరఫున 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక మెక్లెనగన్ 2015 నుంచి 2019 వరకు ముంబయి బౌలింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించాడు. 56 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2015, 2017, 2019 టైటిల్ విజయాల్లో భాగమయ్యాడు. 2020 విజేత జట్టులోనూ ఉన్నాడు. ధావల్ కులకర్ణి 2008-2013, 2020-2021 మధ్య ముంబయికి ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 92 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీశాడు. 2013, 2020 టైటిల్ విజయాల్లో భాగమయ్యాడు. యువ భారత బౌలర్లను తీర్చిదిద్దడంపై ఇకపై దృష్టి సారించనున్నాడు.
టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్‌కు పగ్గాలు..
టీ దిలీప్ టీమిండియా మెన్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ విజయాల్లో భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగమయ్యాడు. బీసీసీఐ ఆయన కాంట్రాక్టును పొడిగించకపోవడంతో ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌లో చేరాడు. ఇదిలా ఉంటే.. బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్స్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన ముంబయి.. కొత్త కోచింగ్ బృందంతో ఐపీఎల్ 2027లో మళ్లీ టైటిల్ రేసులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి కొత్త కోచింగ్ స్టాఫ్ జట్టును ఫైనల్ వరకు చేరుస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..
అక్టోబర్ 31, 2026

One Nation One Election | జమిలితో ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉంటుందా? జేపీసీ చైర్మన్ చౌదరి ఏమన్నారంటే!
అక్టోబర్ 31, 2026

Windfall Tax | పెట్రోల్ ఎగుమతులపై జీరో సుంకం.. డీజిల్, ఏటీఎఫ్‌పై పెంపు
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి
- ●Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత
- ●Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 - తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల
- ●HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!
- ●Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..

Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి

Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత

Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 - తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు

Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల



