Simhastha Kumbh | రేపటి నుంచి సింహస్థ కుంభమేళా షురూ.. 2027లో నాలుగు అమృత స్నానాలు ఎప్పుడంటే?
Simhastha Kumbh | మహారాష్ట్రలోని నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 31న (శనివారం) ధ్వజారోహణ కార్యక్రమంతో కుంభమేళా అధికారికంగా ప్రారంభం కానుంది. 2028 మధ్య వరకు ఈ మహా ఆధ్యాత్మిక వేడుక కొనసాగనుంది.
Simhastha Kumbh | మహారాష్ట్రలోని నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 31న (శనివారం) ధ్వజారోహణ కార్యక్రమంతో కుంభమేళా అధికారికంగా ప్రారంభం కానుంది. 2028 మధ్య వరకు ఈ మహా ఆధ్యాత్మిక వేడుక కొనసాగనుంది. అయితే అత్యంత పవిత్రమైన అమృత స్నానాలు 2027లో జరగనున్నాయి. మొత్తం నాలుగు ప్రధాన అమృత స్నానాలకు ఏర్పాట్లు చేయనున్నారు.
2027లో అమృత స్నానాల తేదీలివే..
కుంభమేళాలో అత్యంత పవిత్రమైన అమృత స్నానాలు 2027 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరగనున్నాయి. ఆగస్టు 2న సోమవారం తొలి అమృత స్నానం ఉంటుంది. ఆషాఢ సోమవతి అమావాస్య సందర్భంగా నాసిక్‌లోని రామ్‌కుండ్, త్రయంబకేశ్వర్‌లోని కుశావర్త కుండ్‌లో స్నానాలు నిర్వహిస్తారు. ఆగస్టు 31 మంగళవారం రెండో ప్రధాన అమృత స్నానం. శ్రావణ అమావాస్య సందర్భంగా రామ్‌కుండ్, కుశావర్త కుండ్‌లో పవిత్ర స్నానాలు ఉంటాయి. సెప్టెంబర్ 11 శనివారం రోజన మూడో అమృత స్నానం (వైష్ణవ అఖాడాలు) భాద్రపద శుద్ధ ఏకాదశి సందర్భంగా నాసిక్‌లోని రామ్‌కుండ్‌లో.. సెప్టెంబర్ 12 ఆదివారం మూడో అమృత స్నానం (శైవ అఖాడాలు) భాద్రపద ద్వాదశి సందర్భంగా నిర్వహించనున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్
కుంభమేళాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని ఒకే వేదికపై అందించేందుకు నాసిక్-త్రయంబకేశ్వర్ కుంభమేళా అథారిటీ (ఎన్‌టీకేఎంఏ) ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందిస్తోంది. అక్టోబర్ 31న జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రాథమిక వెర్షన్‌ను ప్రారంభించనున్నారు. తొలుత కుంభమేళా చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, సంప్రదాయాలు, ఆచారాలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచనున్నారు.
ప్రయాణ వివరాలూ ఒకే చోట..
నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని ప్రముఖ ఆలయాలు, ఘాట్లు, అఖాడాలు, పుణ్యక్షేత్రాల వివరాలను పోర్టల్‌లో పొందుపరచనున్నారు. భక్తులు కుంభమేళాకు ఎలా చేరుకోవాలనే విషయంపై విమాన, రైలు, రోడ్డు మార్గాల సమాచారంతోపాటు స్థానిక రవాణా సదుపాయాల వివరాలనూ అందించనున్నారు. నాసిక్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్‌కు చేరుకునే మార్గాలను వివరించనున్నారు. పోర్టల్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపులు, ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్ మార్గాలు, షటిల్ సర్వీసులు, నడక మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా జోడించనున్నారు. దీంతో దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు కుంభమేళా ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ
- ●Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్
- ●Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప
- ●Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు
- ●Ramchandar Rao | మూసీ ప్రక్షాళన ఓకే.. పేదల ఇళ్లు తీసేస్తామంటేనే ఒప్పుకోం

Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ

Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్

Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..

IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచింగ్ టీమ్.. బ్యాటింగ్ కోచ్ ఉతప్ప





