DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
DK Shivakumar | తమిళనాడులో మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ మండలి సమావేశం (Southern Zonal Council) జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తన గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ (delimitation) ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. మేకెదాటు ప్రాజెక్టుతో తమిళనాడు, పుదుచ్ఛేరి రైతులకు కూడా నీటి భద్రత లభిస్తుందని చెప్పారు.
- 543 లోక్‌సభ స్థానాలను 25 ఏళ్ల పాటూ యథాతథంగా కొనసాగించాలలి
- మేకెదాటు తమిళనాడు, పుదుచ్ఛేరి రైతులకూ ప్రయోజనకరం
- దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కర్ణాటక సీఎం
DK Shivakumar | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ (delimitation) ప్రక్రియను చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. 543 లోక్‌సభ స్థానాలను 25 సంవత్సరాల పాటూ యథాతథంగా కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్‌ను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవాళ తమిళనాడులో మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ మండలి సమావేశం ( Southern Zonal Council) జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీట్ వివాదం, కావేరి జలాలు, నియోజకవర్గాల పునర్విభజనపై తమ అభ్యంతరాలను దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా నియంత్రణ కారణంగా నష్టం జరగకూడదని చెప్పారు. "దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవనే హామీని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇది కేవలం సంఖ్యల గురించే కాదు, సమాఖ్య వ్యవస్థలో మన ప్రాతినిధ్య బలం, గొంతుక ప్రాముఖ్యతకు సంబంధించిన అంశం" అని శివకుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన పిలుపు మేరకు జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణతో, విజయవంతంగా అమలు చేశాయని ఈ సందర్భంగా డీకే గుర్తు చేశారు.
భవిష్యత్తులో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియను కేవలం ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగానే చేపడితే.. జనాభా తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ల అమలును నూతన పునర్విభజన ప్రక్రియ పేరుతో ఆలస్యం చేయకుండా.. ఉన్న 543 సీట్ల పరిధిలోనే మహిళా రిజర్వేషన్‌ను కల్పించాలని, ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 25 సంవత్సరాల పాటూ యథాతథంగా కొనసాగించేలా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని మండలిని కోరారు.
మేకెదాటు ప్రాజెక్టుపై నేను మీకు హామీ ఇస్తున్నా..
ఈ సందర్భంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu project) అంశాన్ని కూడా డీకే ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు తమ రాష్ట్రానికే కాకుండా తమిళనాడుకు కూడా ఎంతో కీలకమైనదిగా నొక్కి చెప్పారు. "రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాకు సూచించారు. మేకెదాటు ప్రాజెక్టుతో కర్ణాటకతోపాటూ తమిళనాడు, పుదుచ్ఛేరిలోని రైతులకు సైతం నీటి భద్రత లభిస్తుంది. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను" అని డీకే శివకుమార్ వెల్లడించారు.
Also Read..
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో మోదీ చాలీసా విడుదల
రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్
సంబంధిత వార్తలు

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
ఆగస్టు 12, 2026

Lord Uday Nagaraju | కర్ణాటక సీఎంతో లార్డ్ ఉదయ్ నాగరాజు భేటీ..
ఆగస్టు 8, 2026

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్
- ●Polytechnic Students | మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?
- ●Telangana State Film Chamber | తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Polytechnic Students | మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?

Telangana State Film Chamber | తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..



