త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ – ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్‌

హాలీవుడ్ అగ్ర హీరో జేస‌న్ స్టాథ‌మ్ హీరోగా న‌టించిన మ్యూటినీ మూవీ రిలీజ్‌కు ముందే లీక‌య్యింది. ఆగ‌స్ట్ 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండు రోజుల ముందే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కావ‌డం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Aug 20, 2026, 4.38 pm IST

Hollywood  | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ – ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్‌
Advertisement

Hollywood | హాలీవుడ్ స్టార్ హీరో జేస‌న్ స్టాథ‌మ్‌కు షాక్ త‌గిలింది. అత‌డి కొత్త సినిమా రిలీజ్‌కు ముందే లీక‌య్యింది. ఈ సంఘ‌ట‌న హాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జేస‌న్ స్టాథ‌మ్ హీరోగా న‌టించిన మ్యూటినీ ఆగ‌స్ట్ 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు జీన్ ఫ్రాంకోయిస్ రిచెట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో...

రిలీజ్‌కు రెండు రోజుల ముందు మ్యూటినీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఫుల్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో సినిమా ల‌వ‌ర్స్ షాక‌య్యారు. దాదాపు రెండు గంట‌ల పాటు మ్యూటినీ అమెజాన్ ప్రైమ్‌లో క‌నిపించింది. చాలా మంది నెటిజ‌న్లు లీక్ గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్ట‌డంతో త‌మ పొర‌పాటును గుర్తించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ సినిమాను తొల‌గించింది.

అమెజాన్ ప్రైమ్‌...

ల‌య‌న్స్ గేట్ ప్లే ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కావ‌డం హాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. లీక్ వెనుక ఎవ‌రున్నారు? సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్లే ఇలా స్ట్రీమింగ్ అయ్యిందా? లేదంటే ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీనా అంటూ నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతున్నారు. పైర‌టెడ్ సైట్స్‌లో కాకుండా ఏకంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే ఈ సినిమా లీక్ కావ‌డం అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. జేస‌న్ స్టాథ‌మ్ ఫ్యాన్స్ అమెజాన్ ప్రైమ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌...

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో జేస‌న్ స్టాథ‌మ్ కోల్ రీడ్ అనే పాత్ర‌లో క‌నిపిస్తాడు. కోల్ రీడ్ బాస్ అనుమానాస్ప‌ద రీతిలో హ‌త్య‌కు గుర‌వుతాడు. ఈ మ‌ర్డ‌ర్ కేసు రీడ్‌పై ప‌డుతుంది. అస‌లైన హంత‌కుల‌ను రీడ్ ఎలా ప‌ట్టుకున్నాడు? హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠా నుంచి ప‌లువురు అమాయ‌కుల‌ను ఏ విధంగా కాపాడ‌డ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

 

 

 

 

 

 

Advertisement
Advertisement