త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Sajjan Kumar | 1984లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల (anti Sikh riots) కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభ‌విస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ (Sajjan Kumar) క‌న్నుమూశారు.

D

National | Published On Aug 20, 2026, 4.02 pm IST

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
Advertisement

Sajjan Kumar | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ( Indira Gandhi) హత్యానంతరం దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభ‌విస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ (Sajjan Kumar) క‌న్నుమూశారు. తీహార్ జైలులో (Tihar jail) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ని ఇవాళ ఉద‌యం జైలు సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే స‌జ్జ‌న్ మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధ‌రించారు. సజ్జన్ మృతికి గల కారణాలు ఆసుపత్రి వర్గాలు ఇంకా వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు.

1984 అక్టోబర్ 31న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ త‌న సిక్కు బాడీ గార్డ్స్ అయిన సత్వత్ సింగ్, బీంత్ సింగ్ చేతిలో హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఢిల్లీ స‌హా ఉత్త‌రాదిన ప‌లు ప్రాంతాల్లో సిక్కు వ్య‌తిరేక అల్లర్లు చెల‌రేగాయి. సాయుధ గుంపులు ఢిల్లీ వ్యాప్తంగా సిక్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వారి ఇళ్లు, దుకాణాల‌పై దాడి చేశాయి. ఈ అల్ల‌ర్ల‌లో 3 వేల మందికిపైగా సిక్కులు హ‌త్య‌కు గుర‌య్యారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఐదుగురి హత్య కేసులో సజ్జన్ కుమార్ దోషిగా తేలారు. ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌ను 2018లో దోషిగా తేల్చింది. ఆయ‌న‌కు 2025లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయ‌న తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన స‌జ్జ‌న్.. ఔటర్ ఢిల్లీ నియోజకవర్గ నుంచి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక‌య్యారు. 2018లో దోషిగా తేలిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

Also Read..

జై జై మోదీ.. హ‌ర హ‌ర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్ల‌బ్‌లో మోదీ చాలీసా విడుద‌ల‌

స్వాతంత్య్ర‌ సమరయోధులను కాంగ్రెస్ అవ‌మానిస్తోంది : అమిత్ షా

నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్‌లో 100 రోజుల ఉచిత కోచింగ్

Advertisement
Advertisement