Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్…ఇప్పుడు హీరోయిన్ – బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
లెనిన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతుంది. వయలెంట్ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో ఎవరంటే?
Entertainment | Published On Aug 20, 2026, 4.01 pm IST
Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే సినీ ప్రయాణం బాలీవుడ్ సినిమాలతో మొదలైంది. బెంగళూరు డేస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన యారియన్ 2 తో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఆ తర్వాత చందూ ఛాంపియన్‌లో నటించింది. ఈ రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌కు షిప్టయ్యింది. రవితేజ మిస్టర్ బచ్చన్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఫెయిలైనా గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకుంది. విజయ్ దేవరకొండ, రామ్‌పోతినేని, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. ఇటీవల రిలీజైన లెనిన్‌తో కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది.
నాలుగేళ్ల తర్వాత...
ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ వయలెంట్ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మిలాప్ జవేరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. వయలెంట్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా మేకర్స్ ఫైనల్ చేశారు.
హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ...
ఆదిత్య రాయ్ కపూర్ సినిమాతోనే హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతుంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాలో రగ్డ్‌డ్ లుక్‌లో చాలా ఇంటెన్స్ రోల్‌లో లెనిన్ బ్యూటీ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివరలో షూటింగ్‌ను మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సియోన్...
ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో సియోన్ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. మైథలాజికల్ టచ్‌తో సాగే యాక్షన్ మూవీకి కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నారు. తెలుగులో నాని బ్లడీ రోమియోతో పాటు మరో రెండు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ – అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
ఆగస్టు 20, 2026

Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?
ఆగస్టు 19, 2026

Ayesha Khan | డైమండ్ రింగ్‌తో అయేషా ఖాన్.. ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటీ..?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..
- ●Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
- ●Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా

Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్

Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం



