Polytechnic Students | మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?
Polytechnic Students | తమకు ఇంగ్లీష్ రాదంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా..? అని విద్యార్థులు నిలదీశారు. తమకు చదువు రాదనడానికి మీకేం రైట్స్ ఉన్నయ్ సర్ అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఇప్పటికైనా జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలని విద్యార్థులు నినదించారు.
డిప్లొమా స్టూడెంట్స్‌ను ఇంఫ్రూవ్ చేయాలనుకుంటే
ఫస్ట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వండి సర్..
మాకు కనీసం ఇంగ్లీష్ లెటర్ రాయడం రాదంటున్నరు
మరి మీకు కనీసం తెలుగునైనా రాయడం వచ్చా సర్
సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన పాలిటెక్నిక్ విద్యార్థులు
Polytechnic Students | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 'శక్తి' (శక్తి స్కీమ్) పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఇంగ్లీష్ రాదంటున్న సీఎం రేవంత్ రెడ్డికి కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా..? అని విద్యార్థులు నిలదీశారు. తమకు చదువు రాదనడానికి మీకేం రైట్స్ ఉన్నయ్ సర్ అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఇప్పటికైనా జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలని విద్యార్థులు నినదించారు. రామోజీ ఫిలిం సిటీ వద్ద ఆయా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు.
శక్తి స్కీమ్ అంటుర్రు.. దాన్ని తలచుకుంటే మాకు హెడెక్ వస్తుంది
మాకు లెటర్ రాయడం రాదంటుర్రు కదా.. లెటర్ రాయడం రానోళ్లమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినమా..? సరే మీరన్నట్టే అనుకుందాం.. అందరం ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మీ కళ్ల ముందరనే కూర్చుంటం. అప్లికేషన్స్ రాస్తం.. మీరు రాస్తరా..? మీరు తెలుగులోనే రాసి చూపించండి.. మీకేం రైట్స్ ఉన్నయ్ మాకు రావు అనడానికి. వచ్చి చూడండి సర్.. ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి.. లేనిది తెచ్చి మాకు పెట్టుకుండి తలకాయ నొప్పులు. ఇప్పటికే శక్తి స్కీమ్ అంటుర్రు.. దాన్ని తలచుకుంటే మాకు హెడెక్ వస్తుంది. దాని వల్ల మాకేం యూజ్ ఉంది.. ఐటీ స్టూడెంట్స్ లాగా మళ్లీ మేం ఫస్ట్ నుంచి చదవలా..? మా డిప్లొమా స్టూడెంట్స్‌ను ఇంప్రూవ్ చేయాలనుకుంటే మాకు ఫస్ట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వండి సర్. ఇక్కడ ఒక్కరికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు.. మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలనుకుంటే అది ఇవ్వండి. లేనిది తెచ్చి శక్తి స్కీమ్ అని ఫస్ట్ నుంచి చదువుకుంటరా.. అంటే ఎవరు చదువుకుంటరు సర్ అని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రొటెస్ట్ చేస్తే పోలీసోళ్లు వచ్చి కొట్టిర్రు..

ఇప్పటి వరకు మాకు ఒక్క స్కాలర్‌షిప్ రాలేదు. కాలేజీ ఫీజు మేం కట్టుకోవాలట.. స్కాలర్‌షిప్ వస్తే మాకు డబ్బులు రిటర్న్ ఇస్తారట. డిప్లొమా చేసిన మాకు లాటరీ ఎంట్రీ ఉంటది. వాళ్లకు, మనకు ఏం తేడా మరి. అట్లయితే ఇంటర్ చేసి వచ్చేటోళ్లం మేం. డిప్లొమాలో బేసిక్ నేర్చుకుని, బీటెక్‌లో నాలెడ్జ్ సంపాదించి ఏదో ఒకటి చేయనికే వస్తది. దీనితోటి అయితే మాకు గవర్నమెంట్ జాబ్స్ అస్సలు రావు. వచ్చేదే ప్రయివేటు. జీవో రద్దు చేస్తారనుకుంటే జీవో రద్దు చేయలేదు. ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తే పోలీసోళ్లు వచ్చి కొట్టిర్రు. అమ్మాయిలను కూడా ఇష్టమొచ్చినట్టు కొట్టిర్రు. అక్కడ ఒక్క లేడి కానిస్టేబుల్ కూడా లేరు.. మాకు కొట్టిర్రు అయిపోయింది.. అమ్మాయిలకు ఎట్ల కొడుతరు. ఇంతనన్న కామన్ సెన్స్ ఉందా వాళ్లకి. మమ్మల్ని కొట్టినోడు వీ అశోక్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్. డిప్లొమా చేస్తున్న మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.. స్కాలర్‌షిప్ లేదు. ఏం లేదు మాకు.. రాయనికే రాదంట మాకు.. ఆయనకు వస్తద రాయడానికి.. ఫస్ట్ రేవంత్ రెడ్డిని అడుగుతున్న. నాది కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ డిస్ట్రిక్ట్.. మా ఊరు పక్కనే ఆయనది. చదవనికే రాదు.. ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు.. మా తమ్ముళ్లు.. ఫోర్త్, ఫిప్త్ క్లాసోళ్లు మాట్లడుతరు ఇంగ్లీష్. చదవనికే రాదు.. ఏం రాదు.. మళ్లా మాకొచ్చి అంటుండు పెద్ద అని మరో విద్యార్థి నిప్పు కణికై మండిపోయాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్





