Telangana State Film Chamber | తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే
థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ తెచ్చిన 'జీవో 77'పై ఫిల్మ్ ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేసింది.
- సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల సవరణపై ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 77ను పునఃసమీక్షించాలని TFCC డిమాండ్
- కొత్త విధానం వల్ల చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టమవుతుందని ఆందోళన
- నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, సినీ పరిశ్రమ పెద్దలతో కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ
Telangana State Film Chamber | త్రినేత్ర.న్యూస్ : తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన G.O. No. 77 ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల ధరల సవరణ, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి ఆగస్టు 14న హోంశాఖ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తాజాగా స్పందించింది. తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాస్తూ, ఈ జీవోను వెంటనే పునఃసమీక్షించాలని ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.
సింగిల్ స్క్రీన్ల మనుగడపై ఆందోళన
ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో నడిచే సింగిల్ స్క్రీన్ (Single Screen) థియేటర్ల పరిస్థితిపై ఛాంబర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త జీవోలో 'స్పెషల్ థియేటర్' (Special Theatre) అనే కొత్త కేటగిరీని తీసుకురావడం, వాటికి ప్రత్యేక కండిషన్లు పెట్టి అడ్మిషన్ రేట్లను సవరించడం వల్ల టౌన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఛాంబర్ ప్రతినిధులు తమ లేఖలో స్పష్టం చేశారు.
కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలి
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా.. నిర్మాతలు (Producers), డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చించాలని TFCC కోరింది. పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో వెంటనే ఒక కన్సల్టేటివ్ కమిటీ (Consultative Committee) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక సూచనలు
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ల మధ్య వ్యత్యాసాలు, ఎగ్జిబిటర్ల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
కొత్త విధానం అమలుతో థియేటర్ల యాజమాన్యాలపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేయాలి.
స్టేక్‌హోల్డర్లతో మీటింగ్ ఏర్పాటు చేసేంత వరకు, ఈ విషయంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచాలి.
తెలుగు సినీ పరిశ్రమ సమతుల్య వృద్ధిని (Balanced Growth) కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో టికెట్ ధరలను ఫిక్స్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్, అధ్యక్షుడు జె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్



