Shashi Tharoor | డీలిమిటేషన్ ఓ రకంగా రాజకీయ డీమోనిటైజేషనే : శశిథరూర్
Shashi Tharoor | డీలిమిటేషన్‌తో (delimitation bill) దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడారు.
Shashi Tharoor | డీలిమిటేషన్‌తో (delimitation bill) దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) తీసుకురావడం మంచిదేనని ఈ సందర్భంగా థరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీని అమలుకు 2011 జనాభా లెక్కలకు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు ముడిపెట్టడం సరికాదన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక రకంగా రాజకీయ “రాజకీయ డీమోనిటైజేషన్” (political demonetisation) వంటిదని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఇది లోక్‌సభ, రాజ్యసభల సమతుల్యతను దెబ్బతీస్తుందని అన్నారు. ఈ పునర్విభజన సమస్య కారణంగా మహిళా కోటా బందీగా మారిందని శశి థరూర్ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టకూడదని పేర్కొన్నారు. ఇక హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం ఫార్ములా అంశాన్ని ఎంపీ శశిథరూర్ విమర్శించారు. మంత్రి ప్రకటన ప్రమాదకర రాజకీయ ప్రకటనగా ఉందని, అదేమీ శాసనపరమైన గ్యారెంటీలా లేదన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 850 సీట్లకు పెంచడం జరిగేపనిలా లేదని, దానికి తగినట్లు రాజ్యసభ సామర్థ్యాన్ని కూడా పెంచాలన్నారు.
పునర్విభజన బిల్లులో మూడు లోపాలు..
పునర్విభజన వల్ల కలిగే పర్యవసానాల గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా శశిథరూర్ పేర్కొన్నారు. దీనిపై లోతైన చర్చ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో మూడు ప్రధాన లోపాలు ఉన్నాయన్నారు. చిన్న, పెద్ద రాష్ట్రాల మధ్య అంతరాన్ని చూడాలన్నారు. ఇక జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు. పునర్విభజనలో జనాభాను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్రాలు అధిక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి పురస్కరించినట్లు అవుతుందన్నారు. ఇక మన ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా ఉన్న రాష్ట్రాలకు, కేంద్ర నిధులను పొందుతున్న రాష్ట్రాలకు మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లును తొందరపాటుతనంతో పాస్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని థరూర్ తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుందని, కానీ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ఈ సంద్భంగా థరూర్ స్పష్టం చేశారు.
Also Read..
మహిళలను బీజేపీ హ్యూమన్ షీల్డ్‌గా వాడుకుంటోంది : డీఎంకే ఎంపీ కనిమొళి
మోదీ, షా మాటలను నమ్మలేం.. డీలిమిటేషన్‌పై ఎంకే స్టాలిన్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






