త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లా?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | మ‌హిళా బిల్లు ముసుగులో డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill) తెచ్చార‌ని, బీజేపీ (BJP) అక్రమంగా, అశాస్త్రీయంగ బిల్లు పాస్ చేసుకోవాలని చూసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమ‌ర్శించారు. బిల్లు వీగిపోవడం మోదీకి చెంపపెట్టు వంటిదన్నారు.

S

News | Published On Apr 18, 2026, 6.31 pm IST

Mahesh Kumar Goud | మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లా?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Advertisement

TPCC Chief Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా బిల్లు (Women's Bill) ముసుగులో డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill) తెచ్చార‌ని, బీజేపీ (BJP) అక్రమంగా, అశాస్త్రీయంగ బిల్లు పాస్ చేసుకోవాలని చూసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమ‌ర్శించారు. బిల్లు వీగిపోవడం మోదీకి చెంపపెట్టు వంటిదన్నారు. ఒంటెద్దు పోక‌డ‌ల‌తో మోదీ ముందుకెళ్లార‌ని.. అందుకే ప్రజాస్వామ్యం విజయం సాధించింద‌ని పేర్కొన్నారు. శ‌నివారం గాంధీ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీపై విమ‌ర్శలు గుప్పించారు.

ఉత్తర భారత దేశానికి ఎక్కువ, దక్షిణానికి తక్కువ సీట్లు వచ్చే బిల్లును అడ్డుకోవడంలో ఖర్గే, రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలు సక్సెస్ అయ్యారన్నారు. బిల్లు వీగిపోవడం చూస్తే బీజేపీకి, ఎన్డీయేకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుందన్నారు. బిల్లు వీగిపోవాలనే డి లిమిటేషన్ తో లింక్ పెట్టారని ఆరోపించారు. తొలి మహిళ ప్రధాని, స్పీకర్, రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. స్వాతంత్య్ర‌ ఉద్యమంలో పాల్గొన‌ని బీజేపీ ఒక్కసారైనా మహిళను జాతీయ అధ్యక్షురాలిని చేయలేదని విమ‌ర్శించారు. ఇలాంటి వారు మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేట‌న్నారు.

మోదీ ప‌చ్చి మోస‌గాడు..

ఆర్ఎస్ఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, బీజేపీలు మహిళలకు ఎప్పుడూ అవకాశాలు ఇవ్వలేదు. ప్రధాని పచ్చి మోసగాడు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి నిందను వేరే వాళ్ల‌ మీద వేయాలని చూస్తున్నారు. కుల, మతాల పేరుతో ఎంపీలు అయ్యి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కర్ణాటక ఎంపీ మాట్లాడితే తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డుకునే సోయి లేదా? ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ తెచ్చుకుంటే.. పాకిస్థాన్ తో తెలంగాణను బుద్ధి లేని ఎంపీ పోల్చితే.. బుద్ధి ఉన్న తెలంగాణ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదు? అని ప్ర‌శ్నించారు.

40 ఏళ్ల త‌న రాజకీయంలో కిషన్ రెడ్డి ఒక్క బీసీ లీడర్ ను అయిన చేశారా? బీజేపీ మోసం చేసే పార్టీ అని మహిళలే కాదు, యావత్తు బీసీలు గ్రహిస్తున్నారు. తెలంగాణలో బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాగేసింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలి. దక్షిణాదికి రాష్ట్రాలకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారి తీస్తది. ట్యాక్స్ లు కట్టడంలో దక్షిణాది ముందుంటే నిధులు, సీట్ల విషయంలో కోత పెట్టడం సరికాదు. దీనిపై బీజేపీ సమీక్షించుకోవాలి. ముఖ్యమంత్రితో కలిసి డెఫినెట్ గా దీనిపై ప్రతిఘటిస్తాం అని హెచ్చరించారు.

2029లో అధికారంలోకి వ‌చ్చి మేమే పెడ్తం..

దేశ స్వాతంత్య్రం, నిర్మాణంలో దక్షిణాది పాత్ర చాలా ఉంది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రియాంక గాంధీ అడిగినట్టు సోమవారం ప్రత్యేకంగా మహిళా బిల్లు పెట్టండి. మేము దానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తాం. కానీ తిరకాసు పెట్టి మహిళలను మోసం చేయాలని చూడొద్దు. మీరు పెట్టకపోతే 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెడతాం. 2023 లో పెట్టిన మహిళా బిల్లును అమలు చేసి ఉంటే 2024లోనే 1/3 మహిళలు సభలోకి వచ్చేవారు కదా అని మ‌హేశ్‌కుమార్ అన్నారు. అప్పుడెప్పుడో సోనియా గాంధీపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇప్పుడు రాజకీయం చేయ‌డం తగదు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఆయన పీసీసీ నాయకత్వాన్ని ఒప్పుకొనే కదా.. మాకు ప్రజలు ఓట్లేశారు. ఎటువంటి తిరకాసుతో బిల్లు పెట్టారో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియ‌దు అనుకుంట. తెలుసుకుంటే మంచిది.

బెంగాల్, తమిళనాడు మహిళలు తెలివైనవారు..

బెంగాల్, తమిళనాడు మహిళలు తెలివైనవారు. బీజేపీ కు తగిన బుద్ధి చెప్తారు. ఓవైసీ జపం, శ్రీరాముడు పేరు చెప్పకుండా అబివృద్ధి పేరు చెప్పి కిషన్ రెడ్డి వచ్చె ఎన్నికల్లో గెలుస్తాడా? ప్రజలు అబివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప దేవుడి పేరు చెబితే ఓట్లు వేసే పరిస్తితిలో లేరు. మేము సెంట్రల్ లో అధికారంలోకి వచ్చాక హైబ్రిడ్ మోడల్ గురించి పరిస్థితులకు తగినట్టు ఆలోచిస్తాం.

పులి తిన్న మేక‌లెన్నో బ‌య‌ట‌పెడతాం..

అదే 20 తారీఖు పులి తిన్న మేకలు ఎన్నో బయటపెట్టబోతున్నాం. ప్రాజెక్టులకు పులి ఎన్ని బొక్కలు పెట్టిందో బహిర్గతం చేస్తాం. ఆ పులిని చూసి పిల్లులు ఎగురుతున్నాయి. క్రాస్ బ్రీడ్ వ్యవస్థ తెచ్చింది కేసీఆర్ కాదా? మంత్రి వర్గ విస్తరణపై సీఎం సరైన సమాధానం ఇస్తారు అని టీపీసీసీ చీఫ్ వివ‌రించారు.

Advertisement
Advertisement