PM Modi | రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8:30 గంటలకు ప్రధాని మాట్లాడతారని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8:30 గంటలకు ప్రధాని మాట్లాడతారని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడతారనేదానిపై ఎలాంటి సమాచారం పంచుకోలేదు. లోక్‌సభలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని ప్రసంగం (PM Modi To Address Nation) ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఏ అంశంపై మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.
మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కీలక బిల్లు వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే (NDA) కూటమికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ రాకపోవడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు సాగలేదు. బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 326 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్నారు.
విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయి..
ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై (opposition) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా విపక్షాలు క్షమించరాని తప్పు (unforgivable mistake) చేశాయని వ్యాఖ్యానించారు. వారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. "ఈ బిల్లును వ్యతిరేకించి విపక్ష ఎంపీలు క్షమించరాని తప్పు చేశారు. వారు మహిళలను నిరాశపరిచారు. అందుకు మహిళలకు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఈ బిల్లును అంగీకరించనివారు తమ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
Also Read..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. డీఏ 2 శాతం పెంపు
యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్‌డేట్.. వీడియోలను అసలు చూడకుండా ఆపొచ్చు..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






