త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shashi Tharoor | కేర‌ళం సీఎంగా శ‌శిథ‌రూర్‌.. స్పందించేందుకు నిరాక‌రించిన ఎంపీ..!

Shashi Tharoor | కేర‌ళం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో యూడీఎఫ్ కూట‌మి ఆధిక్యంలో కొన‌సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యంతో అధికారం చేప‌ట్ట‌నుంది. కేర‌ళం కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రు ? అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే, ఓట్ల లెక్కింపుకు ముందు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను సీఎం ప‌ద‌విపై ప్ర‌శ్నించ‌గా.. దాట‌వేశారు.

P

National | Published On May 4, 2026, 4.49 pm IST

Shashi Tharoor | కేర‌ళం సీఎంగా శ‌శిథ‌రూర్‌.. స్పందించేందుకు నిరాక‌రించిన ఎంపీ..!
Advertisement

Shashi Tharoor | కేర‌ళం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో యూడీఎఫ్ కూట‌మి ఆధిక్యంలో కొన‌సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యంతో అధికారం చేప‌ట్ట‌నుంది. కేర‌ళం కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రు ? అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే, ఓట్ల లెక్కింపుకు ముందు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను సీఎం ప‌ద‌విపై ప్ర‌శ్నించ‌గా.. దాట‌వేశారు. మీరు నాతో ఏం చెప్పించాల‌ని చూస్తున్నారో నాకు తెలుసు. కానీ నేను అలా ఏం చెప్ప‌ను అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో సీఎం ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఆయన వివరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ అధ్యక్షుడి ప్రతినిధి సమావేశమవుతారని చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన త‌ర్వాత హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అనంత‌రం వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నుకున్నా స్వేచ్ఛ‌గా తీసుకుంటార‌న్నారు.

ప‌దేళ్ల త‌ర్వాత అధికారం..

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఈసారి అధికారంలోకి తిరిగి వస్తుందనే నమ్మకాన్ని థరూర్ వ్యక్తం చేశారు. 140 స్థానాలున్న అసెంబ్లీలో 75కు పైగా సీట్లు సాధిస్తూ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తామని ఆయ‌న జోష్యం చెప్పారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ యూడీఎఫ్‌దే అధికార‌మ‌ని అంచ‌నా వేశాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ యూడీఎఫ్ కూట‌మి ఆధిక్యంలో ఉంది. వంద‌కుపైగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించి అధికారాన్ని ద‌క్కించుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం కేరళంకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపవచ్చని థరూర్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement