Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
Shaking well | గుజరాత్ (Gujarat)లోని మోర్బీ (Morbi) జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో నీళ్లు వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ అలల మాదిరిగా అటూ ఇటూ కదులుతున్నాయి (Shaking well).
Shaking well | త్రినేత్ర.న్యూస్ :గుజరాత్ (Gujarat)లోని మోర్బీ (Morbi) జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. విర్పర్ద గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో నీళ్లు వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ అలల మాదిరిగా అటూ ఇటూ కదులుతున్నాయి (Shaking well). ఈ ఘటన గ్రామస్థులను, స్థానిక అధికారులు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గ్రామానికి చెందిన ప్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. పొలంలో దాదాపు 18 అడుగుల లోతు గల బావి ఉంది. దాన్ని మూడు నెలల క్రితమే తొవ్వించారు. అయితే, ఈ నెల 2వ తేదీ నుంచి బావిలోని నీళ్లు సముద్రపు అలల్లా వాటంతట అవే కదులుతున్నాయి. నీళ్లు నిరంతరం కదులుతూ, కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగిపొర్లాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ వింత ఘటను చూసేందుకు పోటెత్తుతున్నాయి. నీటి కదలికలతో స్థానికులు భూకంపం కావొచ్చని తొలుత భయపడ్డారు. అయితే, ఈ ఘటనకు భూకంపాలతో ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
"ఇది భూకంపం వల్ల జరిగిన చర్య కాదు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు వేగంగా నిండుతున్నాయి. ఈ క్రమంలో నీటి ఒత్తిడికి బావి లోపల రాళ్ల మధ్య నుంచి గాలి బయటకు రావడం వల్లే ఈ అలజడి ఏర్పడుతోంది" అని జిల్లా భూగర్భ శాస్త్రవేత్త జేఎస్ వధేర్ తెలిపారు. అంతే కానీ ఇక్కడ భూకంపం వచ్చే సూచనలు ఏవీ లేవని స్పష్టం చేశారు.
#WATCH | Morbi, Gujarat: An unusual incident has been reported in Virparda village, Morbi taluka, where a farm well has been showing wave-like movement. The District Collector has ordered a detailed report from the groundwater research team.
Collector Swapnil Khare says, "...… pic.twitter.com/hnFamPfBoW
— ANI (@ANI) August 7, 2026
Also Read..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
ఐటీ షేర్ల జోష్.. మార్కెట్‌లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
సంబంధిత వార్తలు

Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
సెప్టెంబర్ 9, 2026

Live-In Partner | 40 ఏండ్ల మహిళతో 20 యువకుడి సహజీవనం.. నడిరోడ్డుపై కట్టేసి కొట్టిన పోలీసులు
సెప్టెంబర్ 6, 2026

Mancherial | ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని.. బావిలోకి దూకిన తల్లి..
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



