Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
Husnabad | హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి రూ.33.70 కోట్ల వ్యయంతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి (Development Works) మంజూరు చేసింది.
Husnabad | త్రినేత్ర.న్యూస్: హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి రూ.33.70 కోట్ల వ్యయంతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి (Development Works) మంజూరు చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (రోడ్లు) శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో సిద్ధిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో క్రాస్ డ్రైనేజ్ పనులు, వంతెనలు, రక్షణ గోడలు, లో లెవల్ కాజ్‌వేలు, స్లాబ్ కల్వర్టులు నిర్మించనున్నారు.
ఇందులో సిద్ధిపేట (Siddipet) జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో మొత్తం 15 పనులకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కోహెడ మండలంలో 10 పనులకు రూ.7.20 కోట్లు, హుస్నాబాద్ మండలంలో 2 పనులకు రూ.3.50 కోట్లు, అక్కన్నపేట మండలంలో 3 పనులకు రూ.4.30 కోట్లు కేటాయించారు. అదేవిధంగా హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మొత్తం 5 పనులకు రూ.7.70 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భీమదేవరపల్లి మండలంలో 4 పనులకు రూ.6.20 కోట్లు, ఎల్కతుర్తి మండలంలో ఒక పనికి రూ.1.50 కోట్లు కేటాయించారు. అలాగే కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 8 పనులకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఇందులో చిగురుమామిడి మండలంలో 5 పనులకు రూ.5 కోట్లు, సైదాపూర్ మండలంలో 3 పనులకు రూ.6 కోట్లు కేటాయించారు.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి ,బ్రిడ్జి ల మొత్తానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు






