Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్‌లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 50 సూచీ 24,606.35 వద్ద ప్రారంభమై, గత ముగింపు 24,636తో పోలిస్తే 29.65 పాయింట్లు (0.12 శాతం) నష్టంలో ట్రేడైంది. సెన్సెక్స్ 78,516.08 వద్ద ప్రారంభమై, అనంతరం 78,712.62 వద్ద కొనసాగుతూ గత ముగింపు 78,954.76తో పోలిస్తే 242.14 పాయింట్లు (0.31 శాతం) క్షీణించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. టెక్ మహీంద్రా 2.43 శాతం లాభంతో రూ.1,671.80 వద్ద ట్రేడవగా, టీసీఎస్ 2.33 శాతం పెరిగి రూ.2,428.20కు చేరింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.87 శాతం పెరిగి రూ.1,360 వద్ద కొనసాగింది. ఇన్ఫోసిస్ 0.95 శాతం లాభంతో రూ.1,176.10 వద్ద ఉండగా, మహీంద్రా అండ్ మహీంద్రా 1.29 శాతం పెరిగి రూ.3,450 వద్ద ట్రేడైంది.
పెరిగిన చమురు ధరలు..
మరోవైపు ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బజాజ్ ఫైనాన్స్ 4.07 శాతం పడిపోయి రూ.1,098.20కు చేరగా, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.99 శాతం క్షీణించి రూ.2,023.70 వద్ద ట్రేడైంది. ట్రెంట్ 2.32 శాతం తగ్గి రూ.3,034.90కు, శ్రీరామ్ ఫైనాన్స్ 2.05 శాతం పడిపోయి రూ.1,117.60కు చేరింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 0.72 శాతం తగ్గి రూ.261.20 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.08 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 87 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.06 శాతం పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లకు వచ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మళ్లీ క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 0.17 శాతం నష్టపోయి డాలర్‌కు 95.27 వద్ద ఉంది.
పెరిగిన అనిశ్చితి..
కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ డైలీ చార్టుల్లో చిన్న బాడీ క్యాండిల్ ఏర్పడటం కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య అనిశ్చితిని సూచిస్తోందన్నారు. ఈ సెషన్‌లో 24,700 స్థాయిని కీలక బ్రేకౌట్ స్థాయిగా పేర్కొంటూ, అది దాటితే నిఫ్టీ 24,800 నుంచి 24,850 వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే 24,600 దిగువకు చేరితే 24,500-24,450 స్థాయిల వరకు పడిపోవచ్చని హెచ్చరించారు. అమెరికా మార్కెట్లు రాత్రికి రాత్రే బలహీనపడటం, ముడి చమురు ధరలు పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇరాన్, హోర్ముజ్ జలసంధి అంశాలపై దౌత్యపరమైన పురోగతిపై అనుమానాలు పెరగడంతో క్రూడ్ ధరలు ఎగిశాయి. దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ యీల్డ్స్ పెరిగి, ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆసియా మార్కెట్లలో కూడా ఇదే ప్రభావం కనిపించింది. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు ప్రారంభ లాభాలను కోల్పోయి సుమారు ఒక శాతం వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు






