Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
Rahul Gandhi | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే (save democracy) వారు లాఠీలకు భయపడకుండా నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో జరిగే చలో ఢిల్లీ (Chalo Delhi) మార్చ్‌లో పాల్గొనాలని యువత, విద్యార్థి సంఘాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : సర్ (SIR) ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. నవంబర్ 1న జరగనున్న ఈ మెగా ర్యాలీకి లక్షలాది మంది హాజరవుతారని అంచనా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) యువత, విద్యార్థి సంఘాలకు కీలక పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే (save democracy) వారు లాఠీలకు భయపడకుండా నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో జరిగే చలో ఢిల్లీ మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించినది కాదని రాహుల్ పేర్కొన్నారు. ఇది భారతదేశ ఆత్మ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సాగే పోరాటమని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలన్నీ ఈ ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ ఈ సందర్భంగా కోరారు. "విద్యార్థి సంఘాలన్నింటికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఈ మార్చ్‌లో పాల్గొనండి. భారతదేశంపై దాడి జరుగుతోందని మీరు భావిస్తే, మీ భావ ప్రకటన స్వేచ్ఛ, మీ ఆలోచనలు, మీ దృక్పథం ప్రమాదంలో పడ్డాయని మీకు అనిపిస్తే.. దయచేసి వచ్చి మాతో చేరండి. దేశం కోసం జరిగే ఏకైక నిరసన ఇది. పోలీసులకు భయపడకండి. లాఠీల గురించి ఆందోళన చెందొద్దు. బీజేపీ తమ ఎత్తుగడలను అమలు చేసే ధైర్యం చేయలేదు. మాతో కలిసి నడవండి. రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించడానికి మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ మార్చ్ విజయవంత మవుతుందని ఈ సందర్భంగా రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?
సంబంధిత వార్తలు

Nirmala Sitharaman | వ్యాపారవేత్తల్లో విషం నింపొద్దు.. టాటా గ్రూప్‌పై రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్
అక్టోబర్ 28, 2026

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
అక్టోబర్ 28, 2026

Balmuri Induja Complaint KTR | కేటీఆర్‌పై హైదరాబాద్ సీపీకి బల్మూర్ ఇందుజా ఫిర్యాదు
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
- ●Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
- ●Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ
- ●YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..
- ●Gold And Silver Prices Today | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఎఫెక్ట్.. పతనమైన బంగారం, వెండి ధరలు..
- ●Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్

Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు

Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ

YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..



