త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crocodile | పంట పొలంలో మొస‌లి.. ప‌రుగులు పెట్టిన రైత‌న్న‌లు

Crocodile | మెదక్ (Medak) జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. పొలం ప‌నుల‌కు వెళ్లిన రైతులకు మొస‌లి క‌నిపించ‌డంతో ప‌రుగులు పెట్టారు.

G

Medak | Published On Oct 29, 2026, 11.25 am IST

Crocodile | పంట పొలంలో మొస‌లి.. ప‌రుగులు పెట్టిన రైత‌న్న‌లు
Advertisement

Crocodile | త్రినేత్ర న్యూస్‌: మెదక్ (Medak) జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. పొలం ప‌నుల‌కు వెళ్లిన రైతులకు మొస‌లి క‌నిపించ‌డంతో ప‌రుగులు పెట్టారు. దీంతో గ్రామంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే అప్ర‌మ‌త్త‌మైన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పంట పొలాల్లో ఉన్న మొసలిని పట్టుకునేందుకు సుమారు గంటసేపు శ్రమించారు. చివరకు మొసలిని పట్టుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, మంజీరా నది (Manjeera River) నుంచి ఆ మొసలి పంట పొలాల్లోకి వచ్చినట్లు తెలుస్తున్న‌ది.

Advertisement
Advertisement