Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
Naseeruddin Shah | తాను దిమాగీ నక్సల్ అంటూ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) విడుదల చేసిన వీడియోపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) తీవ్రంగా స్పందించారు. షాను ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్‌గా అభివర్ణించారు.
Naseeruddin Shah | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా (Jamia Millia Islamia) యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) విడుదల చేసిన ఓ వీడియో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ వీడియోలో తాను దిమాగీ నక్సల్ అని గర్వంగా చెప్పుకున్న నసీరుద్దీన్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తనలాంటి విమర్శకులకు దేశ వ్యతిరేకి (anti-national), తుక్డే తుక్డే గ్యాంగ్ అని ముద్ర వేస్తోందన్నారు. నిజమైన తుక్డే తుక్డే గ్యాంగ్ (tukde-tukde gang) అధికారంలో ఉన్నవారేనని ఆయన విమర్శించారు.
దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని ఆయన విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, జామియా మిలియా ఇస్లామియాల్లో విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. "మీరు ఇంకా ఏం చేస్తారు..? దేశ యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, మన విద్యాసంస్థలను నాశనం చేయడానికి, మన ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడానికి ఎంతవరకు వెళ్తారు..?" అని ప్రశ్నించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశ యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరంటూ కేంద్రానికి ఘాటైన హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
షా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) స్పందించారు. షాను ప్రమాదకరమైన అర్బన్ నక్సల్‌గా అభివర్ణించారు. నటుడి ప్రవర్తను అంచనా వేయడంలో తాను పొరపాటుపడ్డానని వ్యాఖ్యానించారు. ఆయన ప్రవర్తన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా రిజుజు పేర్కొన్నారు. "నసీరుద్దీన్ షా ఓ సాదాసీదా నటుడేనని నేను భావించా. అందుకే ఆయన్ని చాలా గౌరవించాను, ఇష్టపడ్డాను. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ అని నాకు తెలియదు. ఆయన అసలు స్వరూపాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆయన ఆలోచనలు భారతదేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం" అని రిజుజు తన పోస్టులో రాసుకొచ్చారు.
Also Read..
మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?
పశ్చిమాసియాలో ఘర్షణలు.. 14 మంది నావికులు సహా 22 మంది భారతీయులు మృతి
యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు
అక్టోబర్ 19, 2026

Manne Krishank | ట్వీట్ల వల్ల ప్రయోజనం లేదు సార్.. సీఎం రేవంత్ అక్రమ సంపాదనపై విచారణ జరిపించండి.. మన్నె క్రిషాంక్
అక్టోబర్ 5, 2026

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..
- ●Gold And Silver Prices Today | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఎఫెక్ట్.. పతనమైన బంగారం, వెండి ధరలు..
- ●Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు
- ●Punjab National Bank | మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?
- ●US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు

YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..

Gold And Silver Prices Today | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఎఫెక్ట్.. పతనమైన బంగారం, వెండి ధరలు..

Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు

Punjab National Bank | మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?



