Punjab National Bank | మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?
Punjab National Bank | ఉత్తరప్రదేశ్ నోయిడా (Greater Noida)లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank)లో భారీ మోసం వెలుగు చూసింది. కస్టమర్ల ఖాతా నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే రూ. 35 కోట్లు మాయమయ్యాయి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన భారీ మోసం
- ఓ రైతు ఖాతాలో రూ.88 లక్షల నుంచి రూ.లక్షకు పడిపోయిన సేవింగ్స్
- లబోదిబో మంటున్న బాధితులు
- సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లే లక్ష్యంగా దోపిడీ
Punjab National Bank | త్రినేత్ర న్యూస్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) లో భారీ మోసం వెలుగు చూసింది. కస్టమర్లకు ఎలాంటి మెసేజ్‌లు రాకుండానే, డబ్బు బదిలీకి సంబంధించిన పత్రాలపై సంతకాలు లేకుండానే ఖాతాదారుల అకౌంట్లలో నుంచి భారీ మొత్తంలో సొమ్ము మాయమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లోగల ఐచ్ఛర్ ప్రాంతంలో ఉన్న పీఎన్‌బీ శాఖలో వెలుగు చూసింది.
ఈ శాఖలో సుమారు రూ. 35 కోట్ల మేర నిధులు గోల్‌మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాదారులు నేరుగా బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు లేదా డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించగా ఈ మోసం వెలుగు చూసింది. ఖాతాదారుల్లో కొందరు సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదుపు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లలోని డబ్బు కూడా మాయమైనట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారు బ్యాంకును నిలదీస్తున్నారు.
రూ.39 లక్షల నుంచి జీరోకి..
తాము ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. తమ ఖాతాల నుంచి డబ్బు బదిలకీ సంబంధించి ఎలాంటి పత్రాలపై, చెక్కులపై సంతకాలు కూడా చేయలేదని వెల్లడించారు. అంతేకాదు, ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు ఎలాంటి మెసేజ్‌లు రాలేదని పలువురు కస్టమర్లు వాపోతున్నారు. తన సేవింగ్స్ అకౌంట్‌లో రూ.39 లక్షలు ఉండేవని.. ఇప్పుడు అందులో జీరో బ్యాలెన్స్ ఉందని హనీఫ్ ఖాన్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుల్లో ఎక్కువ మంది భూసేకరణ నష్టపరిహారంగా పొందిన రైతులు, సాధారణ ప్రజలే కావడం గమనార్హం.
రైతు ఖాతాలో రూ. 88 లక్షల నుంచి రూ. 1 లక్షకు పడిపోయిన బ్యాలెన్స్
తన సేవింగ్స్ ఖాతాలో ఇంతకుముందు సుమారు రూ.87 లక్షల నుంచి రూ.88 లక్షల వరకూ నగదు ఉండేవని ఓ రైతు తెలిపారు. అయితే, ఇప్పుడు బ్యాలెన్స్ రూ.లక్షకు పడిపోయిందని వాపోయాడు. భూసేకరణ పరిహారంగా ఆ డబ్బు పొందినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని సేవింగ్స్ కింద బ్యాంకులో అలాగే దాచుకున్నట్లు వెల్లడించాడు.
బాధితుల్లో బీరోండా గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ కూడా ఉంది. ఆమె టీ, సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండేది. అయితే, జేవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూమికి సంబంధించి ఆమె ప్రభుత్వం నుంచి రూ.1.29 కోట్ల పరిహారం పొందింది. ఆ మొత్తాన్ని బ్యాంకులోనే దాచుకుంది. అయితే, అందులో సుమారు రూ.1.18 కోట్లు మాయమైనట్లు బాధితురాలు వాపోయింది. ఆ డబ్బు తన జీవితకాలపు పొదుపు అని ఆమె పేర్కొన్నారు. ఆమె కుమారుడు డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా ఈ విషయం వెలుగు చూసింది. మరో ఖాతాదారుడు జకీర్ తన ఖాతాలోని రూ.9.5 లక్షలు మాయమైనట్లు ఆరోపించారు. బ్యాంకుకు వెళ్లాకే ఈ మోసం గురించి తెలిసిందన్నారు.
ఎలాంటి అలర్ట్ మెసేజ్‌లూ రాలేదు
సాధారణంగా బ్యాంక్ ఖాతా నుండి రూపాయి విత్‌డ్రా అయినా మొబైల్‌కు క్షణాల్లోనే అలర్ట్ మెసేజ్ వస్తుంది. కానీ ఈ స్కామ్‌లో బాధితులకు ఎలాంటి డెబిట్ లేదా ట్రాన్సాక్షన్ మెసేజ్‌లు రాకపోవడం పలు అనుమానాలకు తీవిస్తోంది. ఈ వివాదాస్పద లావాదేవీలు ఎలా జరిగాయి..? బ్యాంక్ అలర్ట్‌ల ద్వారా కస్టమర్లకు ఎందుకు సమాచారం అందలేదు..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్
డబ్బు మాయంపై ఖాతాదారులు బ్యాంకు ముందు నిరసనకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. బ్రాంచ్ మేనేజర్‌తో పాటు ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. విజిలెన్స్ విభాగం, స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిధులు ఎక్కడికి వెళ్లాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?
గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు
తాజావార్తలు
- ●US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు
- ●Model Schools | మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ టీచర్లు.. 776 పోస్టుల భర్తీ
- ●Stock Markets | ఫెడ్ నిర్ణయంతో మార్కెట్లకు ఊరట.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Amazon | తెల్లవారుజామునే ఇ-మెయిల్.. 250 మంది ఉద్యోగులకు అమెజాన్ షాక్
- ●Middle East Conflict | పశ్చిమాసియాలో ఘర్షణలు.. 14 మంది నావికులు సహా 22 మంది భారతీయులు మృతి

US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు

Model Schools | మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ టీచర్లు.. 776 పోస్టుల భర్తీ

Stock Markets | ఫెడ్ నిర్ణయంతో మార్కెట్లకు ఊరట.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..






