త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్య‌లను ఉప‌సంహ‌రించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ‌

Konda Surekha | ఓ సినీ దంప‌తులు విడిపోవ‌డానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కార‌ణమంటూ మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా రెండేండ్ల త‌ర్వాత త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల వివ‌ర‌ణ ఇచ్చారు.

G

Telangana | Published On Oct 29, 2026, 11.48 am IST

Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్య‌లను ఉప‌సంహ‌రించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ‌
Advertisement

Konda Surekha | త్రినేత్ర న్యూస్‌: ఓ సినీ దంప‌తులు విడిపోవ‌డానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కార‌ణమంటూ మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా రెండేండ్ల త‌ర్వాత త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల వివ‌ర‌ణ ఇచ్చారు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితులు నేప‌థ్యంలో, ప్ర‌తిప‌క్షాన్ని విమ‌ర్శించే క్ర‌మంలో అలా మాట్లాడానే త‌ప్ప ఉద్దేశపూర్వకంగా కాదని చెప్పారు. త‌న వ్యాఖ్యలు కేటీఆర్‌ను గానీ, ఆయ‌న‌ కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే చింతిస్తున్నాన‌ని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాన‌ని ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

`బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRSపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.`

అక్టోబర్ 2024లో ఒక మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు తనను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సినీ దంప‌తులు నాగచైతన్య-సమంత విడిపోవడానికి, కొంతమంది సినీ నటీమణులు సినిమా ఇండస్ట్రీని వీడటానికి కేటీఆర్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌తోపాటు రాజకీయ వ‌ర్గాలు తీవ్రంగా మండిప‌డ్డాయి. ఈఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తన‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. అనంతరం ఆమెపై క్రిమినల్ డెఫమేషన్ (అవమానకర వ్యాఖ్యల) కేసు కూడా దాఖలు చేశారు. మ‌రోవైపు అక్కినేని నాగార్జున కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే తాజాగా మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన కొండా సురేఖ‌.. స‌రిగ్గా రెండేండ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌శ్చాతాపం వ్య‌క్తం చేయ‌డం, వాటిని వెన‌క్కి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

 

Advertisement
Advertisement