Nirmala Sitharaman | వ్యాపారవేత్తల్లో విషం నింపొద్దు.. టాటా గ్రూప్‌పై రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్
Nirmala Sitharaman | టాటా గ్రూప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. వ్యాపారవేత్తల్లో అపనమ్మకాన్ని పెంచొద్దని, ప్రతి అంశాన్నీ రాజకీయాలకు ముడిపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. భారత పరిశ్రమల విజయాలను పదేపదే తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు.
Nirmala Sitharaman | టాటా గ్రూప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. వ్యాపారవేత్తల్లో అపనమ్మకాన్ని పెంచొద్దని, ప్రతి అంశాన్నీ రాజకీయాలకు ముడిపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. భారత పరిశ్రమల విజయాలను పదేపదే తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు. టాటా గ్రూప్‌ను నేరపూరితంగా ధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. వాణిజ్య, న్యాయపరమైన అంశాలను నేరపూరితంగా చిత్రీకరించడం సరికాదన్నారు. వ్యాపార రంగంలో అనవసరంగా అపనమ్మకం, విషపూరిత వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు.
కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక రంగం అణచివేత
కాంగ్రెస్ పాలనలో లైసెన్స్–కోటా రాజ్ ద్వారా భారతీయ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని దెబ్బతీశారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దీంతో లక్షలాది మంది పేదరికంలో మగ్గాల్సి వచ్చిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమలను ఉద్యోగాల కల్పనకు, ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా చూస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే తమ విధానాల లక్ష్యమని స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలూ సరికావు
రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు, సంస్థలకు పరిశ్రమలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. రైతులను బలోపేతం చేయడంతోపాటు యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం కంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని రాహుల్‌కు సూచించారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ న్యాయం కల్పిస్తుందని, ఆ బాధ్యతను న్యాయస్థానాలు నిర్వర్తిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ, గతంలో ఆ పార్టీకి చెందిన ప్రధానులు న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ప్రతిచోటా కుట్రలను వెతకడం మానుకోవాలని విమర్శించారు.
టాటా సన్స్ చైర్మన్ పదవిపై వివాదం
టాటా గ్రూప్‌లో నాయకత్వ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా.. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించిన సెప్టెంబర్ 17 బోర్డు తీర్మానాన్ని సవాల్ చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన రాహుల్.. భారత వ్యాపార రంగం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆటబొమ్మ కాదని వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్‌ను నేరపూరితంగా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
అక్టోబర్ 28, 2026

Nidhhi Agerwal | చేతిలో అరడజను సినిమాలు.. ఒక్క హిట్ కోసం నిధి వెయిటింగ్!
అక్టోబర్ 28, 2026

India Vs Zimbabwe | షఫాలీ విధ్వంసం.. 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్!
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: 'ఇన్వెస్ట్ తెలంగాణ' కర్టెన్ రైజర్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్!
- ●TGPSC MPSO ASO Notification 2026 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్!
- ●Telangana SC Categorization | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలు: నియామకాలు, ప్రమోషన్లలో తప్పనిసరిగా అమలు చేయాల్సిందే!
- ●Hyderabad Sadar Festival | ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సంబరాలు: సీఎం రేవంత్ రెడ్డికి ఉత్సవ కమిటీ ఆహ్వానం!
- ●Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో 'హస్తం' విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
- ●India's Maoists Book Launch | మావోయిస్టుల కోట్లాది రూపాయల డంపులు, బంగారు బిస్కెట్లు: ఆ పుస్తకంలో సంచలన రహస్యాలు వెలుగులోకి!

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: 'ఇన్వెస్ట్ తెలంగాణ' కర్టెన్ రైజర్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్!

TGPSC MPSO ASO Notification 2026 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్!

Telangana SC Categorization | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలు: నియామకాలు, ప్రమోషన్లలో తప్పనిసరిగా అమలు చేయాల్సిందే!

Hyderabad Sadar Festival | ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సంబరాలు: సీఎం రేవంత్ రెడ్డికి ఉత్సవ కమిటీ ఆహ్వానం!



