Gold And Silver Prices Today | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఎఫెక్ట్.. పతనమైన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, దేశీయ సూచీలు భారీ ర్యాలీలో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో డాలర్ పెట్టుబడిదారులకు స్వల్ప పాజిటివ్ సూచనగా చెప్పవచ్చు. దీంతో సహజంగానే సేఫ్ హావెన్ ఆస్తులు అయిన బంగారం, వెండిలపై ఒత్తిడి నెలకొంది.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, దేశీయ సూచీలు భారీ ర్యాలీలో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో డాలర్ పెట్టుబడిదారులకు స్వల్ప పాజిటివ్ సూచనగా చెప్పవచ్చు. దీంతో సహజంగానే సేఫ్ హావెన్ ఆస్తులు అయిన బంగారం, వెండిలపై ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో ఆయా లోహాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ. బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో ఏకంగా 0.86 శాతం పతనమై 4,033 డాలర్లకు చేరగా, వెండి ధర 1.58 శాతం తగ్గి 53 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 124 పాయింట్లు తగ్గి 1,43,581 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1269 పాయింట్లు పడిపోయి 1,93,050 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,395 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,160 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,950 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,39,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,195 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,560గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,19,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరలోనూ మార్పు లేదు.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,796 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,368గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,960 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,79,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే స్థిరంగానే ఉంది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,15,000 ఉండగా, తులం ధర రూ.2,150గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,15,000 ఉండగా, తులం ధర రూ.2,150 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold Prices | బంగారం కొనుగోళ్లను తగ్గించిన వ్యాపారులు.. ధరలు పతనమవుతాయా..?
అక్టోబర్ 28, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
అక్టోబర్ 28, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు
- ●Punjab National Bank | మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?
- ●US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు
- ●Model Schools | మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ టీచర్లు.. 776 పోస్టుల భర్తీ
- ●Stock Markets | ఫెడ్ నిర్ణయంతో మార్కెట్లకు ఊరట.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు

Punjab National Bank | మెసేజ్ లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వలేదు.. కస్టమర్ల ఖాతాల నుంచి రూ. 35 కోట్లు ఎలా మాయమయ్యాయి..?

US Federal Reserve | వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడ్.. భారత మార్కెట్ల దారెటు..?

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క నాటిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్ రావు



