Budget session | నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ
Budget session | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు (Budget session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకూ కొనసాగే ఈ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
Budget session | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు (Budget session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకూ కొనసాగే ఈ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక అంశంగా ఉంది. ఈ అంశంపై దిగువ సభలో రగడ చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ రెండూ తమ ఎంపీలకు విప్ జారీచేశాయి.
ఇక ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. మిడిల్ ఈస్ట్‌లో భారతీయుల భద్రతపై వివరణ ఇవ్వనున్నారు. దీంతో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంతో పాటు.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ధరలు పెరుగుదలకు దారితీసే అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోలుకు ట్రంప్ ‘అనుమతి’ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సర్ అంశాన్ని కూడా సభలో లెవనెత్తేందుకు టీఎంసీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని బీజేపీ లేవనెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.
Also Read..
Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం..
Mojtaba Khamenei | ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల

Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!





