త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ర‌హ‌మ‌త్‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు.. అస‌దుద్దీన్ నోరు విప్పాలి: స‌ల్మాన్ ఖాన్‌

MIM | ఎంఐఎం (MIM) ఎమ్మెల్సీ మీర్జా ర‌హ‌మ‌త్ బేగ్‌పై (MLC Mirza Rahhmat Baig) ఆ పార్టీ అధిష్ఠానం బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. ఆయ‌న పార్టీ స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

G

Hyderabad | Published On Aug 29, 2026, 1.03 pm IST

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ర‌హ‌మ‌త్‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు.. అస‌దుద్దీన్ నోరు విప్పాలి: స‌ల్మాన్ ఖాన్‌
Advertisement

MIM | త్రినేత్ర‌.న్యూస్‌: ఎంఐఎం (MIM) ఎమ్మెల్సీ మీర్జా ర‌హ‌మ‌త్ బేగ్‌పై (MLC Mirza Rahhmat Baig) ఆ పార్టీ అధిష్ఠానం బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. ఆయ‌న పార్టీ స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెంటనే శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్​ఏ హుస్సేన్ అన్వర్ ఆదేశించారు. 4 రోజుల క్రితం అత్తాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీర్జా రహమత్ బేగ్‌ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీపై బ‌హిష్క‌ర‌ణ నిర్ణయానికి కారణాన్ని మాత్రం ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు.

కాగా, ఎమ్మెల్సీ మీర్జా ర‌హమ‌త్ అకృత్యాల గురించి హైద‌రాబాద్ (Hyderabad) సిటీ మొత్తం తెలియాల‌ని బీఆర్ఎస్ నేత‌, హైద‌రాబాద్ యూత్ క‌రేజ్ వ్య‌వ‌స్థాప‌కుడు స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) అన్నారు. ఆయ‌న‌ను ఎంఐఎం నుంచి ఎందుకు బహిష్కరించారో పార్టీ అధ్య‌క్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తన నోటితోనే చెప్పాలని డిమాండ్ చేశారు. మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన కేసులో ఓ ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటు ఒక కార్పొరేట‌ర్ కూడా ఉన్నార‌ని ఆరోపించారు. త‌న వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. అస‌దుద్దీన్ హిజాబ్ గురించి మాట్లాడుతూ.. మ‌హిళ‌తో గౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాల‌ని చెబుతారు. వాళ్ల నాయ‌కులు మాత్రం ఆడ‌వారితో అస‌భ్యంగా వ్య‌వ‌హరిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను ఒవైసీ ముందుంచుతాన‌ని, వాళ్ల అకృత్యాల‌ను ఆయ‌న నోటితోనే చెప్పాల‌న్నారు.

 

Advertisement
Advertisement