Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో మరోసారి అంతరాయం
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఆన్‌లైన్ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. సెన్సార్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
Hyderabad Metro | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఆన్‌లైన్ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. సెన్సార్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లోకి వెళ్లే, బయటకు వచ్చే గేట్ల వద్ద ఉన్న సెన్సార్లు పనిచేయడం మానేశాయి. దీంతో ఆన్‌లైన్ టికెట్లు స్క్యాన్ కాకపోవడంతో స్టేషన్ గేట్ల వద్ద ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.

ట్రైన్ దిగినవారు బయటకు రాలేక, రైలు ఎక్కాలనుకున్నవారు లోపలికి వెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. పరిస్థితి చక్కదిద్దాల్సిన మెట్రో సిబ్బంది చేతులెత్తేశారు. టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ దగ్గర వేచి ఉండాల్సి రావడం ఏంటని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ (Online Services), స్కానింగ్ సేవల్లో తరచూ అంతరాయం ఏర్పడుతున్నదని విమర్శిస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






