త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | 20 మంది టీఎంసీ రెబ‌ల్ ఎంపీల‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court | పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన 20 మంది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీల‌కు (20 Trinamool Rebel MPs) సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.

D

National | Published On Aug 25, 2026, 1.18 pm IST

Supreme Court | 20 మంది టీఎంసీ రెబ‌ల్ ఎంపీల‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన 20 మంది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీల‌కు (20 Trinamool Rebel MPs) సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వారి అన‌ర్హ‌త‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అభిషేక్ బెన‌ర్జీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఆ 20 మంది తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పార్టీ తరఫున దాఖలు చేసిన పిటిషన్‌లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జ‌స్టిస్ విపుల్ ఎం పంచోలిల‌తో కూడిన‌ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ జ‌రిపింది. అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌మ స్పంద‌న తెలియ‌జేయాల‌ని కోరుతూ 20 మంది రెబల్ ఎంపీలకు ధ‌ర్మాస‌నం నోటీసులు జారీ చేసింది. మరోవైపు, విచారణ సందర్భంగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు.

నోటీసులు అందుకున్న వారిలో కాకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బందోపాధ్యాయ్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచన బెనర్జీ, జ‌గ‌దీష్ చంద్ర బ‌ర్మా బ‌సునియా, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయాని ఘోష్, బాపి హల్దర్, మొహమ్మద్ అబూ తాహిర్ ఖాన్, కాళీపద సరెన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మల్, జూన్ మలియా, మితాలి బాగ్, ఖలీలుర్ రహమాన్, మాలా రాయ్, షర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్ ఉన్నారు. ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని ఈ 20 మంది ఎంపీలు.. టీఎంసీని వీడి త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమవుతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌ను సభలో ప్రత్యేకంగా గుర్తించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.

Also Read..

క్రిప్టో మార్కెట్ల‌లో బుల్ ర్యాలీ.. 80వేల డాల‌ర్ల‌కు చేరిన బిట్‌కాయిన్‌..

ప్రియుడి కారుపై ప్రేయ‌సి 3,400 కిస్ సింబ‌ల్స్‌.. వైర‌ల్ కోసం యువ‌కుడి వింత ఆలోచ‌న‌

డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్‌ హోస్టెస్

Advertisement
Advertisement