TMC MPs | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు
TMC MPs | పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీలకు (20 Trinamool Rebel MPs) లోక్‌సభ సెక్రటేరియేట్ (Lok Sabha Secretariat) నోటీసులు ఇచ్చింది.
TMC MPs | త్రినేత్ర.న్యూస్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీలకు (20 Trinamool Rebel MPs) లోక్‌సభ సెక్రటేరియేట్ (Lok Sabha Secretariat) నోటీసులు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా, లోక్‌సభ అనర్హత వేటు రూల్ 6 కింద టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా (Om Birla).. రెబల్స్‌కు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ స్పందన తెలియజేయాలని కోరుతూ 20 మంది రెబల్ ఎంపీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మరోవైపు, విచారణ సందర్భంగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు.
నోటీసులు అందుకున్న వారిలో కాకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బందోపాధ్యాయ్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచన బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయాని ఘోష్, బాపి హల్దర్, మొహమ్మద్ అబూ తాహిర్ ఖాన్, కాళీపద సరెన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మల్, జూన్ మలియా, మితాలి బాగ్, ఖలీలుర్ రహమాన్, మాలా రాయ్, షర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్ ఉన్నారు. ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని ఈ 20 మంది ఎంపీలు.. టీఎంసీని వీడి త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమవుతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమను సభలో ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు.
Lok Sabha Secretariat issues notices to rebel TMC MPs who joined NCPI, seeking their response within seven days to Abhishek Banerjee’s petitions seeking their disqualification under the Tenth Schedule: Sources. pic.twitter.com/WMYmKNEoKc
— Press Trust of India (@PTI_News) August 26, 2026
Also Read..
ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!
- ●Kalvakuntla Kavitha | ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి పెళ్లి కూతురికి తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
- ●boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..
- ●Nepal Flash Floods | ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు
- ●Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
- ●Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా

IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!

Kalvakuntla Kavitha | ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి పెళ్లి కూతురికి తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..

Nepal Flash Floods | ఉప్పొంగిన నది.. కొట్టుకుపోయిన గ్రామాలు






