Gutta Sukhendar Reddy | చిన్నారెడ్డి చేసింది తప్పు.. కొండా సురేఖను తప్పిస్తేనే బెటర్
Gutta Sukhendar Reddy | రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడింది తప్పు అని.. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటేనే బెటర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మంత్రివర్గ పునవర్వ్యవస్థీకరణ చేపడితే అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు.
- వెంటనే వేటు వేయకపోతే పార్టీకే నష్టం
- క్యాబినెట్‌లో, ప్రభుత్వంలో మార్పులు రావాలి
- కేబినెట్‌లో లంబాడా, యాదవ్, మున్నూరుకాపులకు అవకాశం ఇవ్వాలి
- అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్టు కూడా ఉంటుంది
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Gutta Sukhendar Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడింది తప్పు అని.. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటేనే బెటర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మంత్రివర్గ పునవర్వ్యవస్థీకరణ చేపడితే అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో సో మేని విండోస్ ఉంటాయని.. ఎవరు ఏ విండోతో ఉంటారో తెలీదన్నారు. కేబినెట్‌లో లంబాడా, యాదవ్, మున్నూరుకాపులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈమేరకు శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్ తగాదాలు తగ్గించాలి..
ప్రభుత్వంలో మార్పు కనిపించాలి. ప్రజలకు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఉచితాలు ఇవ్వండి.. కానీ అర్హులైన లబ్దిదారులకు ఇవ్వాలి. మూడేళ్లు కావస్తున్నది. క్యాబినెట్ షఫీలింగ్ అవసరం. లంబాడా, యాదవ్, మున్నూరుకాపులకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే కొత్త ధనం వస్తుంది. అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్టు ఉంటుంది. పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలి.
చిన్నా రెడ్డి కి మంచి అవకాశం ఇచ్చింది. పార్టీ పట్ల చిన్నారెడ్డి మాట్లాడటం తప్పు. అంతర్గత మాట్లాడి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీలో సో మేని విండోస్ ఉంటాయి. ఎవరు ఏ విండోతో ఉంటారో తెలీదు. కొండా సురేఖ అంశంలో చర్యలు తీసుకుంటేనే బెటర్. కొండా ఫ్యామిలీపై చర్యలకు రెండు ఆప్షన్‌లు ఉంటాయి. వేటు వేయడం, పునర్వ్యవస్థీకరణ రెండు అవకాశాలు ఉన్నాయి.
Bpl, Apl పై సూచనలు చేశాను. కానీ కార్యాచరణ లేదు. పాత పెన్షన్ పెంచాలి. ఉద్యమకారులకు న్యాయం చేయాలి. గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం. క్యాబినెట్‌లో, ప్రభుత్వంలో మార్పులు రావాలి. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.
22A ను రద్దు చేయాలి..
పెన్షన్లు రూ.4,000కి పెంచాలి, రైతు భరోసా కొనసాగించాలి. 22A ను రద్దు చేయాలి. ఉచితాలు తగ్గించాలి. ఉద్యమకారులకు న్యాయం చేయాలి. క్యాడర్‌లో అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తాం అని సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



