FSSAI | ఫుడ్ ప్యాకెట్లపై “రెడ్” వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన
FSSAI | ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఉంటే వాటిపై 'ఎరుపు రంగు' (Red Warning) హెచ్చరిక లేబుల్‌ను ఏర్పాటు చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించింది.
FSSAI | త్రినేత్ర.న్యూస్ : ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు ఉంటే వాటిపై 'ఎరుపు రంగు' (Red Warning) హెచ్చరిక లేబుల్‌ను ఏర్పాటు చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించింది. వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ఈ నిర్ణయం తోప్పడుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
FSSAI ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. వినియోగదారులు సులభంగా గుర్తించేలా ప్యాకెట్ ముందు భాగంలో ఎరుపు రంగులో ఉండే షడ్భుజి ఆకారపు స్టాప్ సైన్ గుర్తును ముద్రించాల్సి ఉంటుంది. అంతేకాదు లేబుళ్లపై హై షుగర్, హై సాల్ట్, హై ఫ్యాట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా ముంద్రించాలి. ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే సాధారణ న్యూట్రిషన్ టేబుల్ ఫాంట్ సైజు కంటే ఈ హెచ్చరిక గుర్తు ఫాంట్ సైజు ఒక పాయింట్ పెద్దదిగా ఉండాలి.
చిన్నారుల్లో పెరుగుతున్న స్థూలకాయానికి (Childhood Obesity) అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలే కారణమని పేర్కొంటూ ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల మాదిరిగానే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఇటీవలే విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం FSSAI, ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్ల ముద్రణ నిబంధనలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందంటూ ప్రశ్నించింది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదా..? అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్‌ను సూటిగా ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత కాదా..? అని నిలదీసింది. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని, దానికి లొంగిపోయిందని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లోగా ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో తామే తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని తేల్చి చెప్పింది. సుప్రీం అల్టిమేటం నేపథ్యంలో FSSAI కీలక ప్రతిపాదన చేసింది.
Also Read..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..
- ●Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల
- ●CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
- ●IOB | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..
- ●IRCTC | ఒక్క టూర్‌లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..

Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల

CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు

IOB | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు






