త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Laptops Scheme | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన విజ‌య్ స‌ర్కారు.. రూ.2వేల‌కోట్ల‌తో ల్యాప్‌టాప్‌లు..!

Laptops Scheme | తమిళనాడులోని విద్యార్థులకు ముఖ్యమంత్రి సీ జోసెఫ్‌ విజయ్ స‌ర్కారు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘వెట్రి ల్యాప్‌టాప్‌ స్కీమ్‌’గా పేరు పెట్టింది. 2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2వేల‌ కోట్లు కేటాయించింది.

P

National | Published On Nov 7, 2026, 4.00 pm IST

Laptops Scheme | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన విజ‌య్ స‌ర్కారు.. రూ.2వేల‌కోట్ల‌తో ల్యాప్‌టాప్‌లు..!
Advertisement

Laptops Scheme | తమిళనాడులోని విద్యార్థులకు ముఖ్యమంత్రి సీ జోసెఫ్‌ విజయ్ స‌ర్కారు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘వెట్రి ల్యాప్‌టాప్‌ స్కీమ్‌’గా పేరు పెట్టింది. 2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2వేల‌ కోట్లు కేటాయించింది.

ఎవ‌రికి ఇస్తారు..?

ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో మొదటి, రెండో ఏడాది డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, వెటర్నరీ, వ్యవసాయం, ఫిషరీస్‌, లా కోర్సులతోపాటు పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులకూ ఈ పథకం వర్తించనుంది. 2025-26లో పథకం ప్రయోజనం పొందలేకపోయిన అర్హులైన విద్యార్థులతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్‌ సంస్థల్లో ప్రొఫెషనల్‌ కోర్సుల మూడో, నాలుగో ఏడాది చదువుతున్న వారికి కూడా ల్యాప్‌టాప్‌లు ఇస్తారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రత్యేకం

ఇంజినీరింగ్‌ విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రాసెసర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. వీరికి ఇంటెల్‌ కోర్ ఐ5 లేదంటే అందుకు స‌మాన‌మైన ప్రాసెసర్‌ ఉన్న ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలు, సరఫరా బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ ఎల్కాట్‌ (ELCOT)కు అప్పగించింది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.

పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సమర్థవంతమైన అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించడంతోపాటు భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు డిజిటల్‌ సేవలను చేరువ చేయడంలో ఈ ప‌థ‌కం కీల‌కం కానుంది.

Advertisement
Advertisement