Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ
Union Cabinet | దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ఆర్థిక చేయూత, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణ సదుపాయాల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.77,101 కోట్ల భారీ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.
- రైతులకు ఎరువుల సబ్సిడీ..
- చిన్న వ్యాపారాలకు రుణ భరోసా
- నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణకు గ్రీన్‌సిగ్నల్..
- ఢిల్లీలో ప్రపంచస్థాయి మ్యూజియం
Union Cabinet | దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ఆర్థిక చేయూత, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణ సదుపాయాల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.77,101 కోట్ల భారీ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రబీ 2026-27 సీజన్‌కు పోషక ఆధారిత ఎరువుల సబ్సిడీ, ఎంఎస్ఎంఈ రంగానికి క్రెడిట్ గ్యారంటీ నిధులు, నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ, ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పట్టణ రవాణా మెరుగుదలతోపాటు రైతులపై పెట్టుబడి వ్యయ భారాన్ని తగ్గించడం, అట్టడుగు స్థాయిలో వ్యాపారాలను ప్రోత్సహించడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రైతులకు రూ.62,370 కోట్ల సబ్సిడీ
కేంద్రం ప్రకటించిన మొత్తం ప్యాకేజీలో అత్యధికంగా రూ.62,370 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించింది. 2026-27 రబీ మార్కెటింగ్ సీజన్‌కు పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లను మంత్రివర్గం ఆమోదించింది. డీఏపీ, ఎన్‌పీకేఎస్ తదితర ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను రైతులకు అందుబాటు ధరల్లో అందించడం ఈ నిర్ణయం లక్ష్యం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం పడకుండా చూడటంతోపాటు, విత్తనాలు వేసే సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా సరఫరా కొనసాగించేందుకు ఈ సబ్సిడీ దోహదపడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు.
చిన్న వ్యాపారులకు రూ.9,111 కోట్ల రుణ భరోసా
సూక్ష్మ, చిన్న వ్యాపారులకు సంస్థాగత రుణాలు సులభంగా అందించేందుకు కేంద్రం రూ.9,111 కోట్లతో రెండు క్రెడిట్ గ్యారంటీ నిధులను ఏర్పాటు చేయనుంది. ఇందులో మైక్రో యూనిట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌కు రూ.5వేల కోట్లు కేటాయించింది. చిన్న తరహా సంస్థలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. మరోవైపు స్టాండప్ ఇండియా పథకం కింద రూ.4,111 కోట్ల నిధిని ఆమోదించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ఈ గ్యారంటీ నిధుల ద్వారా రుణాల మంజూరులో బ్యాంకులకు భరోసా లభించనుంది. తద్వారా కొత్త వ్యాపారాల స్థాపనకు ప్రోత్సాహం అందనుంది.
నోయిడా మెట్రో విస్తరణకు రూ.2,390 కోట్లు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,390 కోట్లు. నోయిడా, గ్రేటర్ నోయిడా మధ్య రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రతిరోజూ ప్రయాణించే లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది. పారిశ్రామిక, నివాస ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ప్రజా రవాణాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మెట్రో విస్తరణతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది.
ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం
దేశ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో న్యూఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,230 కోట్ల నిధులను కేంద్రం ఆమోదించింది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన నార్త్, సౌత్ బ్లాక్ భవనాల్లో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేయనున్నారు. గతంలో కీలక కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాలుగా వినియోగించిన ఈ భవనాలను జాతీయ వారసత్వ సంపదను ప్రదర్శించే ప్రపంచస్థాయి మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.
పలు రంగాలకు ప్రయోజనం
కేంద్రం ఆమోదించిన ఈ ప్యాకేజీతో వ్యవసాయం, బ్యాంకింగ్, సూక్ష్మ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాలకు ప్రయోజనం కలగనుంది. ఎరువుల సబ్సిడీతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గే అవకాశం ఉండగా, క్రెడిట్ గ్యారంటీ నిధులతో చిన్న వ్యాపారాలకు రుణ లభ్యత పెరగనుంది. మెట్రో విస్తరణతో పట్టణ రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. మ్యూజియం నిర్మాణంతో దేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి అవకాశం ఏర్పడనుంది. వ్యవసాయ రంగానికి ఆర్థిక చేయూతనిస్తూనే, చిన్న వ్యాపారాల విస్తరణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి వివరించారు.
➤ Cabinet approves extension of Aqua Line Metro Rail Corridor from Noida Sector-51 to Greater Noida Sector-04 of Noida #Metro Rail Project with corridor for a length of 8.449 Km with 5 elevated stations
➤ On operationalization of this corridor, Noida and Greater Noida city will have 71.878 Km of active Metro Rail Network
➤ Extension of Aqua Line Metro Rail Corridor from Noida Sector-51 to Greater Noida Sector-04 will not only enhance connectivity but also stimulate economic activity and ease urban mobility for both residents and commuters related to Employment, Business, Education & General Transit
More Details: https://t.co/3RdPYO2Zwa
#CabinetDecisions
— PIB India (@PIB_India) November 11, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sonia Gandhi | మోదీతో పెద్దగా పరిచయం లేదు.. ప్రధాని పదవి తిరస్కరణ వెనుక కారణం ఇదే.. ఆత్మకథలో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు
నవంబర్ 10, 2026

Dimagi Naxals | ప్రధాని “దిమాగీ నక్సల్స్” వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా
నవంబర్ 9, 2026

LK Advani | శత వసంతంలోకి అడుగుపెట్టిన ఎల్కే అద్వానీ
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..
- ●Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో..
- ●Bhu Bharati | భూభారతి రిఫండ్లలో అధికారుల నిర్వాకం..
- ●Kedarnath | కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్‌కు బయల్దేరిన ఉత్సవ పల్లకి
- ●Telangana | వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●N Ramachander Rao | అది ‘యాంటీ భారత్ సమ్మిట్’

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..

Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో..

Bhu Bharati | భూభారతి రిఫండ్లలో అధికారుల నిర్వాకం..

Kedarnath | కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్‌కు బయల్దేరిన ఉత్సవ పల్లకి



