Tatas iPhone factory | టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం
Tatas iPhone factory | తమిళనాడు (Tamil Nadu)లోని ఐఫోన్ విడిభాగాల తయారీ కేంద్రం టాటా ఎలక్ట్రానిక్స్‌లో (Tata Electronics factory) ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో (ETP) లోని నానో-ఫిల్ట్రేషన్ ట్యాంక్ వద్ద నిర్వహణ పనులు చేస్తుండగా విష వాయువులు పీల్చి (toxic gas) ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Tatas iPhone factory | త్రినేత్ర న్యూస్ : తమిళనాడు (Tamil Nadu)లోని ఐఫోన్ విడిభాగాల తయారీ కేంద్రం టాటా ఎలక్ట్రానిక్స్‌లో (Tata Electronics factory) ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. హోసూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలోని ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో (ETP) లోని నానో-ఫిల్ట్రేషన్ ట్యాంక్ వద్ద నిర్వహణ పనులు చేస్తుండగా ఈ ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందినట్లు జిల్లా అధికారి దినేష్ కుమార్ తెలిపారు. విషపూరిత వాయువులు పీల్చి (toxic gas) ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
తొలుత ఓ కార్మికుడు ట్యాంక్ లోకి తొంగి చూసి స్పృహ కోల్పోయి పడిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో మిగతా ఇద్దరు కూడా లోపలికి వెళ్లి పడిపోయారు. గమనించిన తోటి కార్మికులు ముగ్గురినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటనపై యాపిల్, టాటా సంస్థలు ఇప్పటి వరకూ స్పందించలేదు.
కాగా, 'టాటా గ్రూప్'కు చెందిన ఈ ఎలక్ట్రానిక్స్ యూనిట్ భారతదేశంలో దాదాపు 40 శాతం ఐఫోన్ అసెంబ్లీని నిర్వహిస్తుండగా.. మిగతా భాగాలను ఫాక్స్‌కాన్ (Foxconn) తయారు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ఐఫోన్లలో దాదాపు 25 శాతం ఇక్కడే తయారవుతున్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా టాటా ఐఫోన్ తయారీ కేంద్రం రామ్‌సన్ వేర్ (ransomware) దాడి, నీటి కాలుష్య సమస్యలతో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
Also Read..
దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు
సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం
లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Laptops Scheme | విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన విజయ్ సర్కారు.. రూ.2వేలకోట్లతో ల్యాప్‌టాప్‌లు..!
నవంబర్ 7, 2026

Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..
నవంబర్ 7, 2026

Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్
- ●American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..
- ●Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
- ●Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
- ●Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు
- ●Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?

Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్

American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్

Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే



