PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం (Citizen service must) కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. పేదల ఆవేదన అర్థం చేసుకునే మనసు ప్రతి ఉద్యోగికి ఉండాలని చెప్పారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వందేళ్ల ప్రస్థానం లక్షలాది మంది యువత ఆకాంక్షలకు, దేశ ప్రజల నమ్మకానికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం (Citizen service must) కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల ఆవేదన అర్థం చేసుకునే మనసు ప్రతి ఉద్యోగికి ఉండాలని చెప్పారు.
"యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం కేవలం ఒక కమిషన్ ఉత్సవం మాత్రమే కాదు.. అది కోట్లాది మంది భారతీయులు ఆ సంస్థపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. కాలంతో పాటు మారుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా యూపీఎస్సీ దశాబ్దాలుగా నిరంతరం రూపాంతరం చెందుతూ వచ్చింది. కమిషన్ వందేళ్ల ప్రయాణంలో ప్రభుత్వం, సాంకేతికత, పరీక్షా విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ సంస్థ విలువలు మాత్రం చెక్కుచెదరలేదు. భారత దేశ నిర్మాణంలో యూపీఎస్సీ పాత్ర కీలకం. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ సంస్థ అందిస్తున్న సేవలు ఎనలేనివి" అంటూ ప్రధాని కొనియాడారు.
సిటిజన్ ఫస్ట్..
పబ్లిక్ సర్వీస్ కోసం అభ్య ర్థులను ఎంపిక చేసేటప్పుడు జాతి ప్రథమం, పౌరులే ఫస్ట్ అనే రెండు సూత్రాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఎంపికను ఈ రెండు కొలమానాల ద్వారా బేరీజు వేయాలని సూచించారు. అప్పుడే వారు దేశం పట్ల, పౌరుల పట్ల తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలరని వివరించారు. సివిల్ సర్వెంట్లు సామాన్య ప్రజల సమస్యలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచించారు. నాగరిక్ దేవోభవ అనేది ఉద్యోగుల నినాదం కావాలని చెప్పారు.
పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అందించడమే కాదని ప్రధాని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగంలోని నిపుణులు ప్రజాక్షేమం కోసం చురుగ్గా పనిచేయాలని, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అర్థం చేసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు సాంకేతికతను వాడాలన్నారు. దేశం క్రమంగా పట్టణీకరణ వైపు ప్రయాణిస్తోందని ఈ విషయంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సేవల్లో ఏఐని సమర్థంగా వాడుకోవాలని సూచించారు.
'వికసిత్ భారత్' సాధనలో పబ్లిక్ సర్వీస్ పాత్ర కీలకం
అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కరణకు దేశంలో సమర్థవంతమైన పాలన చాలా అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)తో పాటు వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ సేవా కమిషన్ల ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులు వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా, ఆ అభివృద్ధి ద్వారా చేకూరే ప్రయోజనాలను అందుకునే ప్రధాన లబ్ధిదారుల్లో వీరు కూడా ఉంటారని వివరించారు.
కొత్త సవాళ్లు రాబోతున్నాయ్
రాబోయే కాలంలో సివిల్ సర్వెంట్లు సాంప్రదాయ సవాళ్లతో పాటు సరికొత్త సాంకేతిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "సాంకేతికత వేగంగా మారుతోంది. రాబోయే కాలం కొత్త అవకాశాలతోపాటూ సంక్లిష్టమైన సవాళ్లను కూడా తెస్తుంది. భవిష్యత్తు సివిల్ సర్వెంట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్స్ సహా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో సివిల్ సర్వెంట్లు కేవలం సాంప్రదాయ ఫైలింగ్ విధానాలకే పరిమితం కాకుండా, సైబర్ నేరాలు, ఏఐ దుర్వినియోగం, సరికొత్త సాంకేతిక సవాళ్లను ముందే గుర్తించి అడ్డుకునేలా సిద్ధం కావాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, శిక్షణలో క్లిష్టమైన సమస్యల పరిష్కారం, దీర్ఘకాలిక ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి" అని ప్రధాని సూచించారు.
సివిల్ సర్వీసెస్‌లో మహిళల భాగస్వామ్యం పెరిగింది
సివిల్ సర్వీసెస్‌లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతుండటాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన సంవత్సరాల్లో సివిల్ సర్వీసెస్‌లో మహిళా అభ్యర్థుల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అంతేకాకుండా, మహిళలు యూపీఎస్సీ చైర్‌పర్సన్ వంటి అత్యున్నత పదవులను అధిష్టించి, కమిషన్ చరిత్రలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
Also Read..
హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
సంబంధిత వార్తలు

Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
అక్టోబర్ 1, 2026

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
అక్టోబర్ 1, 2026

PM DHARA Scheme | పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ఊతం.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధారా స్కీం..
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Vishnu priya | కామాఖ్య ఆలయంలో విష్ణుప్రియ - ట్రెడిషనల్ శారీలో మెరిసిన తెలుగు యాంకర్
- ●Bank Holidays | బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు లేదు
- ●Vijaya Reddy | నేనే ఖైరతాబాద్ అభ్యర్థిని.. దానం ఎంపీ అభ్యర్థి
- ●Jio | జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.1,499కే ఫోన్, 6 నెలలు ఫ్రీ రీఛార్జ్..
- ●Tummala Nageshwar Rao | 100 శాతం మద్దతు ధరకు కేంద్రమే కొనాలి: మంత్రి తుమ్మల
- ●Bhagyashri Borse | మోహన్‌లాల్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ బోర్సే - ఫొటోతో రూమర్లకు చెక్

Vishnu priya | కామాఖ్య ఆలయంలో విష్ణుప్రియ - ట్రెడిషనల్ శారీలో మెరిసిన తెలుగు యాంకర్

Bank Holidays | బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు లేదు

Vijaya Reddy | నేనే ఖైరతాబాద్ అభ్యర్థిని.. దానం ఎంపీ అభ్యర్థి

Jio | జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.1,499కే ఫోన్, 6 నెలలు ఫ్రీ రీఛార్జ్..



