Med Plus | మెడ్‌ప్లస్‌లో బంగారు నగలు మాయం..
Med Plus | ఏఎస్ రావు నగర్‌లోని మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఓ మహిళా రోగి బంగారు నగలు మాయం అయ్యాయి. దీంతో బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Med Plus | త్రినేత్ర న్యూస్ : ఏఎస్ రావు నగర్‌లోని మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఓ మహిళా రోగి బంగారు నగలు మాయం అయ్యాయి. దీంతో బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఓ మహిళ వైద్య పరీక్షల నిమిత్తం ఏఎస్ రావు నగర్‌లోని మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు గురువారం ఉదయం వెళ్లింది. ఇక టెస్టులు చేసే క్రమంలో ఒంటి మీద ఉన్న బంగారు నగలు తీయాలని అక్కడున్న సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో ఆమె బంగారం తీసి.. తన బ్యాగులో పెట్టేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆమె తన బ్యాగును తీసుకుని ఇంటికి వచ్చింది.
సీన్ కట్ చేస్తే.. బ్యాగులో ఉన్న 40 గ్రాముల బంగారు నగలు మాయమయ్యాయి. దీంతో బాధితురాలు లబోదిబోమనుకుంటూ.. కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
- ●RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ
- ●PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య
- ●PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
- ●GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ

PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య

PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది






