Samvidhan Bachao | విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి
Samvidhan Bachao | నీట్ కుంభకోణం వల్ల కొనసాగుతున్న పరిణామాలు లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల (students) కలలను ఛిన్నాభిన్నం చేశాయని సంవిధాన్ బచావో సంఘర్ష్ సమితి (Samvidhan Bachao Sangharsh Samiti) ఆందోళన వ్యక్తం చేసింది.
Samvidhan Bachao | నీట్ కుంభకోణం వల్ల కొనసాగుతున్న పరిణామాలు లక్షలాది మంది నిజాయితీగల విద్యార్థుల (students) కలలను ఛిన్నాభిన్నం చేశాయని సంవిధాన్ బచావో సంఘర్ష్ సమితి (Samvidhan Bachao Sangharsh Samiti) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు దేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై దేశ వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. జులై 20వ తేదీన దేశ వ్యాప్తంగా 12 గంటల పాటూ నిరాహార దీక్ష చేపట్టాలని యువత, విద్యార్థులకు సూచించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, విద్యా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టండి అంటూ పిలుపునిచ్చింది. దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని తక్షణమే పదవి నుంచి తొలగించాలని, పరీక్షల సమగ్రతలో జరిగిన భారీ లోపాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధిపతి ప్రదీప్ జోషిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, నీట్ పరీక్షల్లో అవకతవకల కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసింది.
Also Read..
యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్.. మాక్ కొంటే ఉచిత ఎయిర్‌పాడ్స్..
ఏం జరిగినా.. జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా : సోనమ్ వాంగ్‌చుక్
యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
సంబంధిత వార్తలు

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
సెప్టెంబర్ 10, 2026

PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
సెప్టెంబర్ 5, 2026

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



