Apple Back to School 2026 | యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్.. మాక్ కొంటే ఉచిత ఎయిర్‌పాడ్స్..
Apple Back to School 2026 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో తన బ్యాక్ టు స్కూల్ 2026 సేల్‌ను భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన మాక్ లను కొనుగోలు చేసే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉచితంగా ఎయిర్‌పాడ్స్ పొందవచ్చు.
Technology | Published On Jul 17, 2026, 2.44 pm IST
Apple Back to School 2026 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో తన బ్యాక్ టు స్కూల్ 2026 సేల్‌ను భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన మాక్ లను కొనుగోలు చేసే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉచితంగా ఎయిర్‌పాడ్స్ పొందవచ్చు. అలాగే అర్హత కలిగిన ఐప్యాడ్లను కొనుగోలు చేస్తే యాపిల్ పెన్సిల్ ప్రోను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా కంపెనీ ఎడ్యుకేషన్ ప్రైసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన మాక్‌బుక్ ఎయిర్ లేదా మాక్‌బుక్ ప్రోలను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.12,900 వరకు ప్రమోషనల్ సేవింగ్స్ పొందవచ్చు. అలాగే ఎయిర్‌పాడ్స్ 4ను పూర్తిగా ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్‌ట్యాగ్ 4 ప్యాక్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఎయిర్‌పాడ్స్ 4 కావాలంటే అదనంగా రూ.5వేలు చెల్లించాలి. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ని ఎంపిక చేసుకోవాలంటే రూ.13వేలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రూ.10,900 వరకు సేవింగ్స్..
అర్హత కలిగిన ఐప్యాడ్ ఎయిర్ లేదా ఐప్యాడ్ ప్రోను కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ.10,900 వరకు ప్రమోషనల్ సేవింగ్స్ లభిస్తాయి. వీరికి యాపిల్ పెన్సిల్ ప్రో ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌ట్యాగ్ 4 ప్యాక్ కోసం రూ.2వేలను అదనంగా చెల్లించాలి. ఎయిర్‌పాడ్స్ 4 కూడా రూ.2వేల అదనపు చెల్లింపుతో అందుబాటులో ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఎయిర్‌పాడ్స్ 4 కోసం రూ.7వేలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ని ఎంపిక చేస్తే రూ.15వేలను అదనంగా చెల్లించాలి. ప్రమోషనల్ సేవింగ్స్ చెక్ అవుట్ సమయంలో నేరుగా వర్తిస్తాయి. కస్టమర్లు కొనుగోలు చేసే అర్హత కలిగిన డివైస్‌తోపాటు ఎంపిక చేసిన ప్రమోషనల్ యాక్సెసరీకి సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే యాపిల్ స్టోర్ ఆన్‌లైన్ లేదా యాపిల్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేసే అర్హత కలిగిన యాక్సెసరీలపై ఉచిత ఎన్‌గ్రేవింగ్ సదుపాయం కూడా అందిస్తోంది.
ఎవరికి వర్తిస్తుంది..
ఈ ఆఫర్ ప్రస్తుతం చదువుతున్న లేదా తాజాగా కాలేజీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు, వారి తరఫున కొనుగోలు చేసే తల్లిదండ్రులు, అలాగే అన్ని స్థాయిల ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బందికి వర్తిస్తుంది. అర్హతను యూనిడేస్ లేదా యాపిల్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వెరిఫై చేసి తమ యాపిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేసిన వారికి ఒక సంవత్సరం పాటు వెరిఫికేషన్ చెల్లుబాటులో ఉంటుంది. స్టోర్‌లో కొనుగోలు చేసే వారు చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ ఐడీ, అడ్మిషన్ లెటర్ లేదా ఇతర అర్హత ధ్రువీకరణ పత్రాలను చూపించవచ్చు. యాపిల్ ఏడాది పొడవునా అందించే ఎడ్యుకేషన్ ప్రైసింగ్ కూడా అర్హత కలిగిన మాక్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, డిస్‌ప్లేలు, ఎంపిక చేసిన యాక్సెసరీలు, అలాగే యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్‌లపై అందుబాటులో ఉంటుంది.
ఎప్పటి వరకు..?
బ్యాక్ టు స్కూల్ 2026 ఆఫర్ ఆగస్టు 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ఆన్‌లైన్, భారత్‌లోని బీకేసీ, సాకేత్ యాపిల్ రిటైల్ స్టోర్లలో, అలాగే 800 040 1966 నంబర్‌కు కాల్ చేసి పొందవచ్చు. ఈ ఆఫర్‌ను నో-కాస్ట్ ఈఎంఐ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో కలిపి ఉపయోగించలేరు. అయితే ప్రమోషన్ గడువు ముగిసిన తర్వాత డెలివరీ అయినా, ప్రమోషన్ వ్యవధిలో ఆర్డర్ చేసిన కొనుగోళ్లు ఈ ఆఫర్‌కు అర్హత పొందుతాయి.
సంబంధిత వార్తలు

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..
సెప్టెంబర్ 19, 2026

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
సెప్టెంబర్ 18, 2026

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026
తాజావార్తలు
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ

KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం



